Begin typing your search above and press return to search.

జగన్ పతనానికి ఆమె పాదం ఒక్కటి చాలా?

By:  Tupaki Desk   |   29 Feb 2016 9:39 AM IST
జగన్ పతనానికి ఆమె పాదం ఒక్కటి చాలా?
X
మాటలతో చెలరేగిపోయే నేతలు మామూలే. మిగిలిన వారంతా ఎక్కడో ఒక పాయింట్ దగ్గరైనా వెనక్కి తగ్గుతారు కానీ.. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత ఆనం వివేకానందరెడ్డి టార్గెట్ చేశారంటే.. అవతలి వారికి మూడినట్లే. ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆయన.. తాజాగా జగన్ పార్టీకి చెందిన మహిళ నేత.. సినీనటి రోజాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఒక మహిళా నేత అన్న ఆలోచన కూడా చేయకుండా ఆయన తీవ్ర విమర్శలే చేశారు. ఆయన అన్న మాటల్ని ఎలాంటి వ్యాఖ్యానం లేకుండా.. ఆయన మాటల్లోనే చెబితేనే మంచిది. రాసేందుకు.. వినేందుకు కాస్త ఇబ్బందిగా ఉన్న పరుష వ్యాఖ్యలు చూస్తే..

= ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని టీడీపీ కాంగ్రెస్ పార్టీలే ఏమీ చేయలేవని రోజా చెబుతున్నారు.. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనానికి నీ ఒక్క పాదమే చాలమ్మ.. రోజమ్మ’’

= ‘‘మగతనం.. రోషం లేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్.. జబర్దస్త్ రోజాను టీడీపీ మీదకు వదిలారు. ఆమె లేడీ బాస్ ల వ్యవహరిస్తున్నారు’’

= ‘‘రాజకీయాల్లో వెకిలి చేష్టలు సరికాదమ్మా.. రోజమ్మా’’

‘‘గతంలో సినిమాల్లో రాణించావు. ఇప్పుడు సినిమాల్లేవు. టీవీలకే పరిమితమయ్యావు. రాబోయే రోజుల్లో జగన్ ప్రోగ్రామ్ లలో రికార్డింగ్ డ్యాన్స్ లకు పరిమితం అవుతావ్’’

= ‘‘రోజాకు మేకప్ లు.. వైఎస్సార్ కాంగ్రెస్ కు పేకప్ లు.. జగన్ కు లాకప్ లు తప్పవు’’

= ‘‘ఫేస్ వేల్యూ గురించి మాట్లాడే రోజా మర్చిపోతున్న విషయం ఏమిటంటే.. జగన్ కు ఫేస్ వాల్యూ లేకపోబట్టే ఆరుగురు ఎమ్మెల్యేలు.. ఒక ఎమ్మెల్సీ టీడీపీలోకి మారారు’’