Begin typing your search above and press return to search.

జగన్ ఓడ త్వరలో మునుగుతుంది

By:  Tupaki Desk   |   12 Feb 2016 5:05 PM IST
జగన్ ఓడ త్వరలో మునుగుతుంది
X
రాజకీయ నాయకులు రెండు రకాలు... తాము మాట్లాడింది రాయమని మీడియాను అడిగి రాయించుకునేవాళ్లు ఒకరకం. వారేం మాట్లాడుతారా? వెంటనే రాసేద్దాం... అని మీడియానే ఎదురు చూసే వారు రెండో రకం. జేసీ - రేవంత్ - ఆనం - కేసీఆర్ - పవన్ ఇలాంటి వీళ్లంతా రెండో రకానికి చెందిన వారు. ఈ లిస్టు పెద్దగా గానే ఇక్కడ కొన్ని పేర్లే ప్రస్తావించాం. ఈ వర్గంలో ఒకడైన ఆనం వివేకానంద రెడ్డి తాజాగా స్పందించాడు. ఈయన గత ప్రభుత్వంలో అధికారం ఎంజాయి్ చేసి కొంత గ్యాప్ తర్వాత ప్రతిపక్షం కాని ప్రతిపక్షంలో ఉండలేక అధికార పక్షానికి దగ్గరై ఇపుడు వారికి సమ్మగా ఉండే వ్యాఖ్యలు చేస్తూ అటు మీడియాలో తరచూ కనబడుతూ రాజకీయాలు నెరపుతున్నారు.

తాజాగా ఆనం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు... "వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక టైటానిక్ ఓడ వంటిదని, అది మునగడం ఖాయం అన్నారు. జగన్ ఎపుడు అరెస్టు అవుతాడో తెలియదని, ఏ క్షణమైనా అతని అరెస్టు తప్పదని అన్నారు. అక్రమాస్తుల కేసులో ఆయన జైలుకెళ్లడం ఖాయం అన్నారు. అలాగే ఆయనను నమ్ముకున్న వాళ్లంతా నట్టేట మునగడం కూడా ఖాయమే... ఇది రాస్కోండి" అని ఆనం వ్యాఖ్యలు చేశారు.