Begin typing your search above and press return to search.

ఆనం వారి రాజ‌కీయ స్టోరీలో ఇన్ని మ‌లుపులా?!

By:  Tupaki Desk   |   28 Aug 2022 12:30 AM GMT
ఆనం వారి రాజ‌కీయ స్టోరీలో ఇన్ని మ‌లుపులా?!
X
రాజ‌కీయాల్లో కొంద‌రు నాయ‌కుల అసంతృప్తి ఎంత చెప్పుకొన్నా త‌క్కువే అనిపిస్తుంది. అది ఎప్ప‌టికీ నెర‌వేరే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు. అలాంటిదే.. వైసీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి అసంతృప్తి అంటున్నారు ప‌రిశీల‌కులు.

గ‌త కాంగ్రెస్ హ‌యాంలో ఆయ‌న మంత్రిగా ప‌నిచేశారు. త‌ర్వాత‌.. రాష్ట్ర విభ‌జ‌న‌తో.. వైసీపీ నుంచి పిలుపు వ‌చ్చినా.. అటుచూడ కుండా.. సైకిల్ ఎక్కారు. ఈ ప‌రిణామానికి తోడు.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న జ‌గ‌న్‌పై వివేకానంద‌రెడ్డి స‌టైర్లు పేల్చారు. ఫ‌లితంగా.. త‌ర్వాత‌.. ప‌రిణామాలు అనుకూలంగా మార‌క‌పోగా.. వ్య‌తిరేకంగా ఉన్నాయి.

అయితే.. ఆయ‌న‌కు ఎమ్మెల్సీ అయినా.. ద‌క్కుతుంద‌ని.. చంద్ర‌బాబు హ‌యాంలో అనుకుంటే.. త‌న‌కు ఎక్క‌డ మొగుడై కూర్చుంటాడో.. అని.. సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అడ్డుప‌డ్డాడ‌నే వాద‌న త‌మ్ముళ్ల మ‌ధ్య సాగింది. దీంతో చూసి చూసి.. వేచి వేచి.. వైసీపీలోకి వ‌చ్చారు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో వెంక‌ట‌గిరి నియోజ క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. త‌న‌కు క‌నీసం గుర్తింపు లేకుండా పోయింద‌నేది.. ఆయ‌న ఆవేద‌న‌. మంత్రి ప‌ద‌వి ఆశించారు. అది ద‌క్క‌లేదు.

టీటీడీ బోర్డులో స‌భ్య‌త్వం ఆశించారు. అది కూడా చిక్క‌లేదు. పోనీ.. జిల్లా స్థాయి ప‌ద‌వైనా ద‌క్కుతుంద‌ని అనుకున్నారు. అది కూడా ల‌భించ‌లేదు. దీంతో తీవ్ర నిరుత్సాహం.. నిస్పృహ‌లో ఆయ‌న కూరుకుపోయా రు. తీవ్ర అసంతృప్తితో కుమిలిపోతున్నారు. పోనీ.. ఇప్ప‌టికిప్పుడు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పార్టీ మారి పోతే.. ఏదైనా ప్ర‌యోజ‌నం ఉంటుందా? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు. టీడీపీ అయితే.. ఆయ‌న ను ఆహ్వానించొచ్చు. ఆత్మ‌కూరు టికెట్ కూడా ఇవ్వొచ్చు. కానీ, మంత్రి ప‌ద‌వి మాత్రం ఇచ్చే స‌మ‌స్యే లేదు.

రేపు చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తే.. నెల్లూరు జిల్లాలో అనేక మందికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. వారంద‌రినీ పక్క‌న పెట్టి ఆనంకు ఇచ్చే అవకాశం లేదు. పోనీ.. వైసీపీలోనే ఉన్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. ఆనంకు ప్రాధాన్యం ద‌క్కుతుందా? అంటే.. అది కూడా సాధ్య‌మ‌య్యేలా లేదు.

ఎంతో మంది సీనియ‌ర్లు ప‌ద‌వుల కోసం.. నెల్లూరులో కాచుకుని కూర్చున్నారు. వీరిని కాద‌ని.. ఆనంకు ఇచ్చే సాహ‌సం.. జ‌గ‌న్ చేయ‌బోర‌నేది టాక్‌. పైగా ఆనం కోరుకున్న ఆత్మ‌కూరు టికెట్ అస‌లు ఇచ్చే ప‌రిస్థితి కూడా లేదు. ఈ ప‌రిణామాల‌తో ఆన్ వారి రాజ‌కీయ క‌థ అనేక మ‌లుపులు తిరుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.