Begin typing your search above and press return to search.

దోచుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చా.. దయచేసి గెలిపించండి

By:  Tupaki Desk   |   10 Oct 2020 1:30 PM GMT
దోచుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చా.. దయచేసి గెలిపించండి
X
బిహార్​ ఎన్నికల్లో ఓ ఇండిపెండెంట్​ అభ్యర్థి విచిత్రంగా ప్రచారం చేస్తున్నాడు. అతడి ప్రచారం చూసి స్థానికులతో పాటు మీడియా కూడా అవాక్కయ్యింది. ‘ నా పేరు రాజేంద్ర ప్రసాద్. నలందా జిల్లా బర్బీఘా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నేను కేవలం డబ్బు సంపాదించడానికే రాజకీయాల్లోకి వచ్చా. ప్రజా సేవ చేయాలని నాకు లేదు. ఇంతకాలం పాటు దర్జీగా పనిచేశా. ఏమీ సంపాదించలేకపోయా. ఎప్పటికైనా కోటీశ్వరుడిని కావాలనేది నా కల. అందుకు రాజకీయం ఒక్కటే మార్గం అని నిర్ణయించుకున్నా. అభివృద్ధి పేరిట దోపిడీ చేసి కొంత డబ్బు సంపాదించుకుంటా. దయచేసి నాకు ఓట్లేసి గెలిపించండి. నా మీద ఇప్పటికే రెండు కేసులున్నాయి. ఒకటి భూవివాదం కేసు, రెండోది అత్యాచారం కేసు. రాజకీయాల్లోకి రావాలంటే ఇవే అర్హతలు’ అంటూ రాజేంద్ర ప్రసాద్​ ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నాడు.

అతడి ప్రచార శైలి చూసి ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. నన్ను గెలిపిస్తే ప్రజలకు రోడ్లు వేయిస్తా, ఇళ్లు కట్టిస్తా అని హామీలు ఇచ్చేవాళ్లను చూశాం. కానీ తొలిసారి ఓ వ్యక్తి నేను దోచుకోవడానికి వచ్చానంటూ ప్రచారం చేస్తుండంతో ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు. బీహార్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. వేశారు. అభివృద్ధి పనుల పేరిట నియోజకవర్గానికి వచ్చే డబ్బులు పనులు ఏమీ చేయకుండానే తినేస్తా అనడంతో మీడియా నోరెళ్ల బెట్టింది. అయితే రాజేంద్రప్రసాద్​కు ఎంత మంది ఓట్లేస్తారో తెలియదు కానీ తన విభిన్న ప్రచారంతో ప్రస్తుతం బిహార్​ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అయితే రాజకీయాల్లో అవినీతి అక్రమాలు ఎలా పెరగిపోయాయో చెప్పేందుకు రాజేంద్రప్రసాద్​ ఈ తరహా ప్రచారం చేస్తున్నారా? మరేదైనా ఇతర కారణం ఉన్నదా.. అని కొందరు భావిస్తున్నారు. ఏది ఏమన్నా ఓ ఎమ్మెల్యే అభ్యర్థి బహిరంగంగా తాను దోచుకోవడానికే వచ్చాను.. ఓట్లేయండి అని చెప్పడం మాత్రం ఇదే తొలిసారి.