Begin typing your search above and press return to search.

అమెరికాలో వారి వీసా గడువు పొడిగింపు?

By:  Tupaki Desk   |   28 March 2020 11:50 AM GMT
అమెరికాలో వారి వీసా గడువు పొడిగింపు?
X
అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు లక్ష దాటడంతో ఒక్కసారిగా అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. వారం రోజుల క్రితం 8 వేల కరోనా పాజిటివ్ కేసులు ఉన్న అమెరికా....ఇప్పుడు లక్ష దాకా కేసులు నమోదు కావడంతో తలలు పట్టుకుంటోంది. కరోనా పాజిటివ్ కేసుల్లో చైనా, ఇటలీలను అమెరికా దాటేసింది. న్యూయార్క్, వాషింగ్టన్‌లలో వైరస్ తీవ్రత మరింత అధికంగా ఉంది. చికాగో, డెట్రాయిట్, న్యూ ఓర్లీన్స్‌లలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 213 నగరాల మేయర్లు తమ దగ్గర తగినంతం మంది వైద్య సిబ్బంది లేరంటూ చేతులెత్తేశారు. కరోనా పరీక్ష కేంద్రాల వద్ద అనుమానితులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిలో చాలామంది విదేశాలకు చెందిన వారు...ఎక్కువమంది భారతీయులు ఉన్నారు. అయితే, మరి కొద్ది రోజుల్లో వారి వీసా గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ ముందు మరో సమస్య వచ్చి పడింది. వారందరికీ వీసా గడువు పొడిగించే పరిస్థితులు ప్రస్తుతం లేకపోవడంతో ఏం చేయాలన్న సందిగ్దంలో ట్రంప్ సర్కార్ పడింది.

ఇప్పటికిప్పుడు నైపుణ్యం కలిగిన ఇమ్మిగ్రంట్స్ వీసాలను రెన్యువల్ చేయడం...తనిఖీ చేయడం జరిగే పని కాదు. ఎందుకంటే వీసాల వ్యవహారాలు చూసే యూఎస్ సీఐఎస్ ఆఫీసులు మూసివేశారు. అలా అని లీగల్ ఇమ్మిగ్రంట్స్ ను విధుల్లో నుంచి తొలగిస్తే...కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదముంది. ఇటువంటి కష్ట సమయంలో వైద్య రంగం, దానికి అనుబంధంగా పనిచేసే వారి సేవలు చాలా అవసరం. అయితే, వీరందరి వీసా గడువును మరి కొద్ద ినెలల పాటు ఆటోమేటికట్ గా పొడిగించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అందుకోసం, హౌస్ లో బిల్ కూడా ప్రవేశపెట్టారు. అయితే, అది సెనేట్ బిల్లుగా మారాల్సి ఉంది. మరోవైపు, ఈ వీసా పొడిగింపు పాత ఇమ్మింగ్రెంట్స్ కు మాత్రమే వర్తించేలా చర్యలు తీసుకోవాలన్న యోచనలో ఉన్నారు. ఇటు ఇమ్మిగ్రెంట్స్ కు నష్టం కలగకుండా...అదే సమయంలో ప్రభుత్వానికి వారి వల్ల లాభం ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. డూ నో హార్మ ప్రొవిజన్ వల్ల ఎవరికీ నష్టం కలగకుండా చూడాలిని యోచిస్తున్నారని తెలుస్తోంది.