Begin typing your search above and press return to search.

మోడీకి రాహుల్ హగ్..‘అమూల్’ ఫొటో వైరల్

By:  Tupaki Desk   |   21 July 2018 11:46 AM GMT
మోడీకి రాహుల్ హగ్..‘అమూల్’ ఫొటో వైరల్
X
ఇప్పుడంతా దాని గురించే చర్చ.. అవిశ్వాసం పెట్టిన టీడీపీకి అంతగా పేరు రాలేదు కానీ. రాహుల్ గాంధీ చేసిన ఈ ఒక్క పని.. దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. పార్లమెంటులో శుక్రవారం అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వెళ్లి ప్రధాని నరేంద్రమోడీని కౌగిలించుకున్నారు. ఆ తర్వాత కన్నుకొట్టారు. ఈ ఫొటోలు - వీడియోలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఎవరికి తోచిన క్రియేటివిటీని వారు జోడిస్తూ వీటిపై స్ఫూఫ్ లు - సెటైర్లు విడుదల చేస్తున్నారు.

తాజాగా డైరీ కోఆపరేటివ్ సంస్థ అమూల్ కూడా రాహుల్-మోడీ హగ్గింగ్ పై ఓ ఫీచర్ కార్టూన్ ఫొటోను విడుదల చేసింది. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘ఆలింగనంగా ఉందా.? లేక ఇబ్బందికరంగా ఉందా.?’ అంటూ ఫోటో పైన క్యాప్షన్ ఇచ్చింది. ఆ ఫొటోలో రాహుల్ గాంధీ కన్నుకొడుతున్నట్టు స్కెచ్ గీసి చూపించింది.

వర్ధమాన వ్యవహారాలపై అమూల్ కంపెనీ విడుదల చేసే అనేక క్రియేటివ్ పిక్చర్స్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంటాయి. తమ ఉత్పత్తుల ప్రమోషన్ చేయడానికి ఈ ఫొటోలను అమూల్ ఉపయోగించుకుంటుంది. అమూల్ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.