Begin typing your search above and press return to search.

అమృతను ఇంకా వదలని సోషల్ మీడియా

By:  Tupaki Desk   |   27 Jan 2019 6:00 PM IST
అమృతను ఇంకా వదలని సోషల్ మీడియా
X
ఆమెకు జరిగింది అన్యాయమే. ఆ విషయాన్ని ఎవరైనా ఖండించాల్సిందే. అమృత భర్త ప్రణయ్ ను ఆమె కన్న తండ్రే హత్య చేయించాడనే అభియోగాలు ఉన్నాయి. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తోంది. ఈ దిశగా వార్తలు వస్తే అందులో తప్పులేదు. కానీ అమృత గర్భం దాల్చిన విషయంతో పాటు ఆమెకు ఏకంగా బిడ్డ పుట్టాడంటూ వార్తలు వండి వార్చి సోషల్ మీడియా దారి తప్పింది.

అవును.. పండంటి మగ బిడ్డకు అమృత జన్మనిచ్చిందంటూ సోషల్ మీడియాలో 2 రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై స్వయంగా అమృత స్పందించింది. దయచేసి తనపై తప్పుడు వార్తలు ప్రచురించవద్దని రిక్వెస్ట్ చేసిన అమృత - తనకు ఇంకా డెలివరీ అవ్వలేదని నిర్థారించింది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం - డాక్టర్లు ఆమెకు ఫిబ్రవరి మొదటి వారంలో డెలివరీ డేట్ ఇచ్చారు. కానీ అంతలోనే ఆమెకు ప్రసవం అయినట్టు - మగబిడ్డ పుట్టినట్టు వార్తలు రావడంతో అమృత కుటుంబం ఇబ్బంది పడుతోంది.