Begin typing your search above and press return to search.

ప్రణయ్ మళ్లీ పుట్టాడు

By:  Tupaki Desk   |   30 Jan 2019 2:01 PM GMT
ప్రణయ్ మళ్లీ పుట్టాడు
X
మిర్యాలగూడకు చెందిన అమృత పండంటి బిడ్డకుజన్మనిచ్చింది. ఆమెకు మగ బిడ్డ జన్మించాడు. ప్రస్తుతం బాబు - తల్లి క్షేమంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ప్రణయ్ హత్య కేసు గురించిఅందరికీ తెలిసిందే. ఆ ప్రణయ్ భార్యే అమృత. హత్య జరిగిన సమయానికి ఆమె నాలుగు నెలల గర్భవతి. ఇప్పుడు మగబిడ్డకు జన్మనిచ్చింది

మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ - అమృత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ పెళ్ళి - అమృత తండ్రి మారుతీ రావుకు నచ్చలేదు. దీనికితోడు తనఎదురుగానే - అదే ఊరులో కూతురు - అల్లుడు కాపురం పెట్టడంతో తట్టుకోలేకపోయాడు. కిరాయిగుండాలకు సుపారీ ఇచ్చి ప్రణయ్ ను హత్యచేయించాడు.

హత్య తర్వాత అమృతను అబార్షన్ చేసుకోని - కొత్తజీవితం ప్రారంభించమని చాలామంది సూచించారు. కానీ అమృత ఒప్పుకోలేదు. పుట్టిన బిడ్డలో ప్రణయ్ ను చూసుకొని జీవిస్తానని చెప్పింది. ఇప్పుడు నిజంగానే ప్రణయ్ మళ్లీ పుట్టాడని అంటున్నారంతా. దీంతో అమృత ఆనందానికి అవధుల్లేవ్.