Begin typing your search above and press return to search.

సీఎం సతీమణి ఆ సినిమాలో పాటలు పాడారు

By:  Tupaki Desk   |   2 March 2016 4:40 AM GMT
సీఎం సతీమణి ఆ సినిమాలో పాటలు పాడారు
X
దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నా.. కొందరు సీఎంల దారి కాస్త భిన్నంగా ఉంటుంది. అసమాన్యులైనప్పటికీ సామాన్యులుగా ఉండటం వారి స్పెషాలిటీ. అలాంటి జాబితాలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఒకరు. సింఫుల్ గా ఉండటం.. సీఎం అన్న స్టైల్ మాట వరసకు లేకుండా.. కామ్ గా తన పని తాను చేసుకుంటూ పోవటం.. ఎక్కడా విమర్శలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవటం లాంటి వాటితో పాటు.. పాలనపై తన ముద్రను పడేలా చేస్తున్న ఆయన వివాదాస్పద వార్తల్లో పెద్దగా కనిపించరు.

కానీ.. ఆయన సతీమణి పేరు తాజాగా వార్తల్లోకి వచ్చింది. రాజకీయాలకు భిన్నమైన వార్తల్లో ఆమె పేరు రావటం గమనార్హం. ప్రియాంకా చోప్రా నటిస్తున్న ‘‘జై గంగాజల్’’ చిత్రంలో మహారాష్ట్ర సీఎం సతీమని అమృత ఫడ్నవీస్ ఒక భక్తిపాటతో పాటు మరికొన్ని పాటలు పాడారు. తొలిసారి సినిమాకు పాడటం గొప్ప అనుభూతిగా పేర్కొన్న ఆమె.. తాను పాడిన పాటకు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. గీత రచయిత రాసిన పాటలు బాగున్నాయని.. గంగాజల్ సినిమాలో పాటలు పాడటంతో మరో సినిమాలో పాడే అవకాశం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా సీఎం సతీమణి పాటలు పాడటం.. ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా అన్నప్పుడు.. మరిన్ని ఆఫర్లు రావటం మామూలే. ఇందులో ప్రత్యేకత ఏముంది..? చూస్తూ.. చూస్తూ.. సీఎంతో సంబంధాలు ఎవరు మాత్రం పెట్టుకోవాలని అనుకోరు చెప్పండి.