Begin typing your search above and press return to search.

అమరావతి: లంక భూముల అక్రమాలపై సిట్ దర్యాప్తు !

By:  Tupaki Desk   |   26 Jun 2020 12:45 PM IST
అమరావతి: లంక భూముల అక్రమాలపై సిట్ దర్యాప్తు !
X
ఏపీ రాజధాని అమరావతిలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న భూ కుంభకోణంలో ప్రభుత్వం నియమించిన సిట్ బృందం నిజాలు నిగ్గు తేల్చడానికి చాలావేగంగా విచారణ కొనసాగిస్తుంది. ఇప్పటికే రాజధాని పేరుతో జరిగిన అక్రమాలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు సాగుతుండగా... సిట్ కూడా రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో తెలియక అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి

సిట్ ప్రధానంగా తుళ్లూరు కేంద్రంగా సాగిన లంక భూముల వ్యవహారంపై ముందుగా దృష్టిసారించింది. న సిట్ దూకుడు మీద ఉంది. ఇప్పటికే ఈవిషయం మీద అదుపులోకి తీసుకున్న సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో నాలుగు గంటల పాటు సిట్ బృందం తనిఖీలు చేపట్టింది. లంక భూములకు సంబంధించిన రికార్డులను సిట్ బృందం పరిశీలించినట్టు సమాచారం. భూ అక్రమాలకు సంబంధించిన కొంత సమాచారాన్ని..డాక్యుమెంట్లను సేకరించినట్టు తెలుస్తుంది.

ఈ డాక్యుమెంట్స్ ఆధారంగా , అమరావతిలో ఇప్పటికే చేపట్టిన విచారణ ఆధారంగా గత ప్రభుత్వ హయాంలో తహసీల్దారుగా పని చేసిన అన్నే సుధీర్ బాబు వ్యవహర శైలిపై సిట్ ఆరా తీసినట్టుగా చెబుతున్నారు. రాయపూడి డిప్యూటీ కలెక్టర్ ఉమా దేవిని సిట్ బృందం గతంలో ఓసారి విచారించింది. ఉమాదేవి నుంచి సేకరించిన సమాచారం మేరకు తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో సిట్ తనిఖీలు చేపడుతోంది. మరోవైపు రాజధాని భూ అక్రమాల్లో పాత్ర ఉన్నట్లు తేలడంతో గతంలో సీఐడీ అరెస్టు చేసిన సీఆర్డీయే అధికారి, డిప్యూటీ కలెక్టర్ మాధవిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

గత టీడీపీ సర్కారులో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతలు రాజధాని ప్రాంతంలోని లంక భూములు, అసైన్డ్ భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసి తిరిగి ప్రభుత్వానికే విక్రయించి కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పటికే ఇలా తక్కువ ధరలకు కొన్న అసైన్డ్ భూముల మార్పిడిని వైసీపీ సర్కారు రద్దు చేసింది. తాజాగా వాటిని రైతుల నుంచి కొనుగోలు చేసిన వారిపైనా సిట్ దర్యాప్తు చేస్తోంది. అలాగే లంక భూముల విషయంలోనూ భారీగా డబ్బులు చేతులు మారాయని సిట్ అనుమానిస్తోంది.