Begin typing your search above and press return to search.
అమరావతి భూ కుంభకోణం కేసు...కీలక అధరాలు కోర్టు కి సమర్పించిన ప్రభుత్వం !
By: Tupaki Desk | 2 Dec 2020 1:15 PM ISTఏపీ రాజదాని అమరావతి భూకుంభకోణంపై విచారణ వేగం పుంజుకుంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదైంది. రాజధాని ప్రాంతంలో ఎవరెవరు..ఎప్పుడు భూములు కొనుగోలు చేశారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ ప్రాంతంలో రాజధాని వస్తుందనేది ముందుగానే తెలుసుకుని ఎవరెవరు ఏ మేరకు భూములు కొనుగోలు చేశారనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుత ప్రభుత్వం రాజధాని ప్రకటనకి ముందే కొంతమంది బడా బాబులు అక్కడ భూములు కొన్నారని ఆరోపణలు చేస్తుంది.
ఇకపోతే, తాజాగా ఈ కేసు విషయంపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టులో కీలక వాదనలు వినిపించింది. ఈ భూ కుంభకోణం కేసులో ఓ ప్రముఖ పత్రికా కథనం ప్రకారం ... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ సన్నిహితులు అమరావతి చుట్టుపక్కల కొనుగోలు చేసిన భూముల వివరాలను డాక్యుమెంట్ నెంబర్లతో సహా హైకోర్టుకి అందజేసింది. ఎన్నారైలతో కొందరు సాగించిన వాట్సాప్ సంభాషణల వివరాలను కూడా కోర్టుకు అందించింది. అమరావతి భూ కుంభకోణం వెనుక చాలామంది బడాబాబులు ఉన్నారని, సీఐడీ దర్యాప్తును కొనసాగనివ్వాలని అభ్యర్థిస్తూ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. సీఐడీ అదనపు ఎస్పీ గోపాలకృష్ణ కౌంటర్ దాఖలు చేశారు.ఈ కేసు విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేశారు.
ఏజీ శ్రీరామ్ హైకోర్టుకు నివేదించిన అంశాల్లో కీలక వివరాలని ఒకసారి చూస్తే .. ప్రముఖ పత్రికా కథనం ప్రకారం .. లలిత సూపర్ స్పెషాలిటీస్ ఆస్పత్రి యాజమాన్యం వెలగపూడి, తాడికొండ, తక్కెళ్లపాడు గ్రామాల్లో 2014 సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 27 వరకు 26.62 ఎకరాలను కొనుగోలు చేసిందని ఆ పత్రికా ప్రచురించింది. తమ భూములున్న చోట రాజధాని వస్తుందని, ల్యాండ్ పూలింగ్ పథకాన్ని ప్రకటిస్తారని తెలియక భూములు విక్రయించినట్లు అమ్మకందార్లు వాంగ్మూలం లో తెలిపారు. అలాగే , నార్త్ ఫేస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, చేకూరి తేజస్వి తదితరులు చినకాకాని, కంచికచర్ల, బలుసుపాడు, లింగాపురం, నవులూరు, బేతంపూడి, మందడం, ధరణికోట, ఉంగుటూరు తదితర గ్రామాల్లో 2014 జూన్ 6 నుంచి డిసెంబర్ 24 వరకు 17.80 ఎకరాలను కొనుగోలు చేశారట. అలాగే , చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి చెందిన హెరిటేజ్ ఫిన్ లీజ్‌లో పనిచేసిన కిలారు రాజేశ్ కు లోకేష్ తో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. రాజేశ్ భార్య శ్రీహాస, మరొకరు కంతేరులో 2.64 ఎకరాల భూమిని 2014 ఆగస్టు, సెప్టెంబర్ లో కొన్నారు. తాళ్లం మణికొండ అనంత సాయి విశ్వనాథ్ భాగస్వామిగా ఉన్న గాయత్రీ రియల్టర్స్ రాజధాని గ్రామాల్లో 23.60 ఎకరాలను 2014 మార్చి నుంచి నవంబర్ వరకు కొనుగోలు చేసిందని ప్రభుత్వం కోర్టుకి తెలిపింది. వర్టెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం నంబూరు, కంతేరు, కాజ గ్రామాల్లో 2014 జూన్ నుంచి నవంబర్ వరకు 12.23 ఎకరాలు కొనుగోలు చేసింది. గుడ్ లైఫ్ ఎస్టేట్స్ యాజమాన్యం కూడా నవులూరు, బేతపూడి, ఆత్మకూరు గ్రామాల్లో 10.23 ఎకరాలను కొనుగోలు చేసింది.