Begin typing your search above and press return to search.
దూసుకొస్తున్న అంఫాన్ తుఫాన్ .... అల్లకల్లోలంగా మారిన సముద్రం !
By: Tupaki Desk | 19 May 2020 3:20 PM ISTబంగాళాఖాతంలో పుట్టిన అంఫాన్ తుఫాను, మరింత బలపడి... అత్యంత వేగంగా అత్యంత బలంగా దూసుకుపోతోంది. ఇప్పటికే మహమ్మారి సృష్టిస్తున్న విలయతాండవానికి దేశం మొత్తం వణికిపోతోంది. ఈ సమయంలో భీకర తుఫాను అంఫాన్ మరింత తీవ్ర రూపం దాల్చింది. గంటకు 265 కిలోమీటర్లకు పైగా వేగంతో వీస్తున్న ఈదురుగాలులతో... అంఫాన్ అతి తీవ్ర తుఫాను బంగాళాఖాతంలో దూసుకుపోతోంది. ఈ తుఫాను సోమవారం కేటగిరీ 5గా… సూపర్ సైక్లోనిక్ తుఫానుగా మారిందని వాతావరణ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.
కాగా.. సైక్లోన్ ఉంఫున్.. ఉత్తర-ఈశాన్యం వైపు పయనించి మరింత తీవ్రంగా పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను తాకనుంది. దీని ప్రభావంతో ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. అత్యంత వేగంగా వెళ్తున్న ఈ తుఫాను వల్ల ఏపీ, ఒడిశా, బెంగాల్‌తోపాటూ... బంగ్లాదేశ్, మయన్మార్‌లో తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని అమెరికా వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు బంగాళాఖాతంలో ఏర్పడిన అతి పెద్ద తుఫాన్ ఇదే.
బుధవారం మధ్యాహ్నం ఈ తుఫాను... బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటవచ్చనే అంచనా ఉంది. ఐతే... ఇది నానాటికీ బలపడుతుండటంతో... దీని వల్ల జరిగే నష్టం అంచనాలకు మించి ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీన్ని కేటగిరీ 5గా నిర్ణయించడాన్ని బట్టీ ఇది ఎంత ప్రమాదకరమైందో గుర్తించాలని కోరారు. ప్రస్తుతం బంగాళాఖాతం తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా ఉన్నాయి. అలలు ఎగసిపడుతున్నాయి. తుఫాను ప్రస్తుతం బెంగాల్ తీరాన్ని దాటుతుండటంతో... అక్కడ పరిస్థితి మరింత భయంకరంగా ఉంది. ఐతే... ఇది తీరాన్ని దాటేటప్పుడు బలహీనపడుతూ... కేటగిరి 2 లేదా 3గా ఉంటుందని అంచనా వేస్తున్నారు