Begin typing your search above and press return to search.

అమిత్ షాకే గుణపాఠం నేర్పారట..

By:  Tupaki Desk   |   19 Dec 2019 12:11 PM IST
అమిత్ షాకే గుణపాఠం నేర్పారట..
X
కాకలు తీరిన యోధుడైన రాజకీయ ఆటలో ఎప్పుడో ఒకప్పుడు ఓడిపోవాల్సిందే.. దేశ రాజకీయ యవనికపై ‘అభినవ చాణక్యుడు’ అని పేరొందిన అమిత్ షా కూడా ఓడిపోయాడు. తనకు ఆ బిరుదు పోయినందుకు బాధపడడం లేదని.. అదొక గుణపాఠం అని అమిత్ షా చెప్పుకొచ్చాడు.

తాజాగా ఆజ్ తక్ చానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమిత్ షా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఓటమితో తనకు గుణపాఠం వచ్చిందని అన్నారు. ఎన్నికలకు ముందే శివసేనతో పొత్తు సందర్భంగా బీజేపీ నేతే ముఖ్యమంత్రి అని స్పష్టంగా చెప్పామని.. శివసేన దీనికి ఒప్పుకుందని.. మోడీ చరిష్మాతో గెలిచిన శివసేన అనంతరం కాంగ్రెస్, ఎన్సీపీలతో పారిపోయి బీజేపీని మోసం చేసిందని అమిత్ షా ఫైర్ అయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమికి ప్రజలు పట్టంకట్టినా శివసేన ముఖ్యమంత్రి పదవి అత్యాశతో మహారాష్ట్రలో తాము అధికారానికి దూరమయ్యామని అమిత్ షా తెలిపారు.

ఈ ఓటమితో అభినవ చాణక్యుడు అన్న బిరుదు తనకు పోయిందని అంటున్నారు.. ఇది చాలా సంతోషంగా ఉందని.. మంచి గుణపాఠాన్ని శివసేన నేర్పిందని అమిత్ షా అన్నారు..