Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎంట్రీ- అమిత్ షా కు బ్యాడ్ డే!

By:  Tupaki Desk   |   25 Nov 2018 6:07 AM GMT
తెలంగాణ ఎంట్రీ- అమిత్ షా కు బ్యాడ్ డే!
X
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్ర‌చార ప‌ర్వంలో అప‌శృతి చోటుచేస‌కుంది. ఆయ‌న హెలీకాప్ట‌ర్ దిగుదుండ‌గా....తూలిపడ్డారు. మిజోరంలోని వెస్ట్ తుయ్‌పుయ్ అసెంబ్లీ స్థానం పరిధిలోని త్లబంగ్ గ్రామ సమీపాన ఎన్నికల ప్రచారసభలో పాల్గొనేందుకు గురువారం ఆయన హెలికాప్టర్‌లో వచ్చారు. సభాస్థలికి కొద్ది దూరంలో ఆగిన హెలికాప్టర్ మెట్లను సరిగ్గా చూసుకోకుండానే దిగబోయారు. కానీ ఒక మెట్టును వదిలి కింది మెట్టుపై కాలుపెట్టబోయి పడిపోయారు. వెంటనే ఆయన భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయన్ను లేపారు. ఔత్సాహికులెవరో వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో వైరలైంది.

ఇదిలాఉండ‌గా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆదివారం తెలంగాణ ఎన్నికల్లో పాల్గొనేందుకు వస్తున్నారు. నాలుగు బహిరంగసభల్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌కు చేరుకున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు పరకాల నియోజకవర్గంలో బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. అనంతరం నిర్మల్‌లో జరిగే బహిరంగసభకు హాజరవుతారు. ఆ తర్వాత దుబ్బాక, మేడ్చల్‌ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగసభల్లో మాట్లాడతారు. అనంతరం ఢిల్లీకి వెళ్లిపోతారు. మళ్లీ ఈనెల 28న అమిత్‌షా ప్రచారం నిర్వహిస్తారు. ఈనెల 28న ఉదయం ఆదిలాబాద్‌, మధ్యాహ్నం చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం హిమాయత్‌నగర్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం ఎల్బీనగర్‌లో ఏర్పాటు చేసే బహిరంగసభలో పాల్గొంటారు. డిసెంబర్‌ 2న అమిత్‌షా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

ఇదిలాఉండ‌గా, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈనెల 27న తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఈనెల 27న ఉదయం నిజామాబాద్‌లో, మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసే బహిరంగసభల్లో ఆయన ప్రసంగిస్తారు. డిసెంబర్‌ 3న హైదరాబాద్‌లో జరిగే బహిరంగసభకు ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొంటారు.