Begin typing your search above and press return to search.
గులాబీ బాస్ కు అమిత్ షా భారీ కౌంటర్ తప్పదా?
By: Tupaki Desk | 27 Nov 2020 11:45 AM ISTకొన్నిసార్లు అంతే. మనమెంత బాగా ప్లాన్ చేసినా.. ప్రత్యర్థి మనకు మించిన ప్లాన్ చేయటం.. వారికి కాలం కలిసి రావటం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల్ని చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ముందు అనుకున్న దానికి భిన్నంగా గ్రేటర్ ఎన్నిక ఇప్పుడు మహా టఫ్ గా మారిందన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. ఏముంది బీజేపీ? అని తేలిగ్గా తీసేసిన గులాబీ అధినాయకత్వం.. తమ అంచనాలు తప్పు అవుతున్నాయన్న సమాచారం వారిని ఒత్తిడికి గురి చేస్తోంది.
దుబ్బాకలో ఏ రీతిలో అయితే.. ఎన్నికల ఎజెండాను సెట్ చేశారో.. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్నివిజయవంతంగా అమలు చేయటం.. ఆ ట్రాప్ లో గులాబీ బాస్ పడిపోవటం చూస్తే.. బీజేపీ వ్యూహకర్తల్ని మెచ్చుకోవాల్సిందే. గడిచిన కొద్దిరోజులుగా మోడీని నేరుగా టార్గెట్ చేస్తున్న కేసీఆర్ తీరుపై బీజేపీ అగ్రనాయకత్వం ఉడికిపోతోందని చెబుతున్నారు. దేశంలో మరే ముఖ్యమంత్రి.. విపక్షాలు సైతం మోడీ సర్కారు తీరును విమర్శించే విషయంలో వెనకాడుతుంటే.. అందుకు భిన్నంగా కేసీఆర్ తీరు ఉండటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది.
కేసీఆర్ కు ఘాటు పంచ్ ఇవ్వాలని వారు తహతహలాడుతున్నట్లుగా సమాచారం. అదే సమయంలో.. తెలంగాణలో తిరుగులేని తన అధికారాన్ని ప్రశ్నించేలా కమలనాథులు బలపడటాన్ని సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. దుబ్బాక గెలుపును వాపుగా ఫీల్ అయిన కేసీఆర్.. తన అంచనాలు కాస్త తేడా కొట్టినట్లుగా సన్నిహితుల వద్ద వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ నేతల ప్రచారానికి ఘాటుగా రియాక్ట్ అయ్యేందుకు శనివారం నాటి సభను వేదికగా వాడుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధాని మోడీ మీద విరుచుకుపడటంతో పాటు.. విద్వేషాల్ని రెచ్చగొట్టేలా బీజేపీ విష ప్రచారం చేస్తుందన్న మాట ఆయన నోటి నుంచి బలంగా వచ్చే అవకాశం ఉందంటున్నారు.
అయితే.. కేసీఆర్ వ్యాఖ్యలకు బలంగా తిప్పి కొట్టేందుకు బీజేపీ దగ్గర ఉన్న అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని భావిస్తున్నారు. శనివారం సాయంత్రం కేసీఆర్ బహిరంగ సభ జరిగితే.. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వస్తుండటంతో..కేసీఆర్ మీద ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసేందుకు అవకాశం ఉందంటున్నారు. చివరి పంచ్ బీజేపీకే దక్కుతుందన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి కేసీఆర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టేలా వేదికను సిద్ధం చేసుకున్న బీజేపీ.. అమిత్ షా రూపంలో దాన్ని వినియోగించుకోనుందని చెబుతున్నారు.