Begin typing your search above and press return to search.

యాక్షన్ ప్లాన్ : అమిత్ షా అక్కడికే వచ్చి కూర్చుంటారా...?

By:  Tupaki Desk   |   22 July 2022 11:43 AM GMT
యాక్షన్ ప్లాన్ : అమిత్ షా అక్కడికే వచ్చి కూర్చుంటారా...?
X
కేంద్రంలోని బీజేపీకి వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వచ్చే సీట్లు ఎక్కడా అంటే ఉత్తరాదిలో ఉన్నవే తగ్గిపోయే సీన్ ఉంది. ఈ మధ్యనే జరిగిన ఉత్తరప్రదేశ్ లో ఓడినా కూడా ఎస్పీ కి బలం బాగా పెరిగింది. అలాగే మధ్యప్రదేశ్ లో తాజాగా జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రభ మసకబారింది. పదహారు కార్పోరేషనల్లో సగానికి మాత్రమే దక్కాయి. ఇక్కడ కాంగ్రెస్ సహా విపక్షాల బలం పెరిగింది.

ఇక రాజస్థాన్ వంటి చోట్ల బీజేపీ ఓడినా పుంజుకోలేదు, పంజాబ్, ఢిల్లీలలో కూడా ఆప్ హవా సాగుతోంది. మహారాష్ట్రలో అధికారం దక్కినా గ్రౌండ్ లెవెల్ లో మాత్రం పూర్తిగా పట్టు చిక్కలేదు. బీహార్ లో ఏదో నితీష్ తో కలసి సర్కార్ ఏర్పాటు చేసినా ఆర్జేడీ రూపంలో అసలైన భయం అలాగే ఉంది.

దాంతో సౌత్ ఈసారి కొమ్ము కాయకపోతే పని అవుటు అన్నట్లుగా బీజేపీ సీన్ ఉంది. సౌత్ లో చూస్తే కర్నాటక తప్ప మిగిలిన చోట కాషాయనికి కలసివచ్చేది లేదు. ఎన్నికల వేళకు తమిళనాడులో అన్నాడీఎంకేలో చీలిన తేవడం అయినా చేయాలని శశికళను ముందు పెట్టి రాజకీయం నడపాలని ఎత్తులేవో ఉన్నాయి. ఇక ఏపీలో అయితే జగన్ వచ్చిన చంద్రబాబు వచ్చినా కూడా ఉన్న సీట్లు బీజేపీవే అవుతాయన్న నిబ్బరం అయితే ఉంది.

కానీ ఎటొచ్చి తెలంగాణావే తేలడంలేదు. దాంతో తెలంగాణా మీద బీజేపీ గట్టిగానే ఫోకస్ పెట్టిందని అంటున్నారు. ఈ మధ్య ప్రధాని మోడీ తెలంగాణాకు చెందిన ఒక పత్రికా ప్రతినిధిని తన వద్దకు రప్పించుకుని చాలా సేపు రాజకీయ ముచ్చట్లు పెట్టారని టాక్. తెలంగాణాలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది. ఏం చేస్తే బీజేపీ అధికారంలోకి వస్తుంది అన్న దాని మీద కూడా పెద్దాయన ఆరా తీశారని అంటున్నారు.

ఇపుడు చూస్తే అమిత్ షా తెలంగాణా మీద కంప్లీట్ దృష్టి పెడుతున్నారు. నెలకు రెండు రోజుల పాటు తెలంగాణాలోనే టూర్ చేసేలా షా తన యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసుకున్నారు. అంటే తెలంగాణాలో రానున్న ఏడాది అంతా చాలా గట్టిగానే జనంలో ఉండాలని తిరగాలని అమిత్ షా డిసైడ్ అయిపోయరన్న మాట.

తెలంగాణావ్యాప్తంగా బీజేపీ సభలు, ర్యాలీలు సమావేశాలు నిర్వహించడం ద్వారా కేసీయార్ సర్కార్ మీద పెరిగే వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. ఇక పార్టీ నేతలకు సరీన డైరెక్షన్ ఇస్తూ కాషాయ జెండాను ఎగరేసేలాగా చూడాలనుకుంటోంది. ఈ ఏడాది ఎండింగులో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి. అక్కడ ముందు గెలవడానికి బీజేపీ చూస్తుంది. ఆ మీదట జరిగేది కచ్చితంగా తెలంగాణా మీద పోరు మాత్రమే అంటున్నారు. ఏదో విధంగా ఈసారి గెలుపు గుర్రం ఎక్కాలన్న బీజేపీ ఆరాటానికి తెలంగాణా ఇచ్చే అవకాశం ఎంత అన్నదే ఇక్కడ పాయింట్ మరి.