Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్ల క‌ళ్ల‌ల్లో ఏం క‌న‌ప‌డ‌లేదా అమిత్ షా!

By:  Tupaki Desk   |   13 Feb 2019 5:25 AM GMT
ఆంధ్రోళ్ల క‌ళ్ల‌ల్లో ఏం క‌న‌ప‌డ‌లేదా అమిత్ షా!
X
మాట‌లు చెప్ప‌మంటే మ‌న‌సు ప‌ర‌వ‌శించిపోయేలా చెబుతుంటారు క‌మ‌ల‌నాథులు. ఆ పార్టీకి అన్నీ తామైన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే మోడీ కానీ పార్టీ చీఫ్ అమిత్ షా కానీ మాట‌ల‌తో మ‌న‌సు దోచేసేలా మాట్లాడుతుంటారు. రాజ‌కీయాల‌కు భావోద్వేగ మాట‌ల్ని జోడించి మాట్లాడ‌టంలో దిట్ట అయిన ఈ ఇద్ద‌రూ.. త‌మ మాట‌ల్లో ప‌స‌ను మ‌రింత పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న వేళ‌.. విపక్షాల‌పై విరుచుకుప‌డుతున్న మోడీషాలు.. ఇప్పుడు త‌మ విమ‌ర్శ‌ల‌కు మ‌రింత ప‌దును పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మోడీకి వ్య‌తిరేకంగా కూట‌మి క‌డుతున్న నేత‌లంతా రాష్ట్ర స్థాయి నేత‌లుగా షా అభివ‌ర్ణించారు.

తాను దేశం మొత్తం తిరిగాన‌ని.. అంద‌రి క‌ళ్ల‌ల్లోనూ మోడీనే మ‌ళ్లీ ప్ర‌ధాని కావాల‌న్న ఆశ క‌నిపించిన‌ట్లుగా చెప్పారు. అంద‌రి సంగ‌తి స‌రే.. మ‌రి ఆంధ్రా ప్రాంతంలో కూడా తిరిగారు క‌దా? మ‌రి.. ఆంధ్రోళ్ల క‌ళ్ల‌ల్లో ఏం క‌నిపించింది? ఢిల్లీకి మించిన రాజ‌ధాని క‌డ‌తామ‌ని.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పిన మాట‌ల్ని అమ‌లు చేయ‌ని మీ తీరుపై ఆంధ్రోళ్ల క‌ళ్ల‌ల్లో ఆగ్ర‌హం క‌నిపించ‌లేదా?

మోడీ మాట ఎత్తితే.. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ఎరుపెక్కేఆంధ్రోళ్ల క‌ళ్ల గురించి మ‌ర్చిపోయారా? మాట త‌ప్పిస్తున్నారా? మోడీ పై దేశ ప్ర‌జ‌ల క‌ళ్ల‌ల్లో ప్రేమ‌ను చూసిన‌ట్లు చెబుతున్న మీరు.. ఆంధ్రోళ్ల క‌ళ్ల మీద కాస్త క్లారిటీ ఇస్తే బాగుంటుంది. దేశమంతా తిరిగే క్ర‌మంలో ఆంధ్రోళ్ల ముచ్చ‌ట మ‌ర్చిపోతే.. గుర్తు తెచ్చుకొని విష‌యం చెబితే బాగుంటుంది.