Begin typing your search above and press return to search.

అబ్బో.. అమిత్ షా ఆశలు మామూలుగా లేవుగా?

By:  Tupaki Desk   |   9 May 2022 5:31 AM GMT
అబ్బో.. అమిత్ షా ఆశలు మామూలుగా లేవుగా?
X
అరచేతిలో అధికారం ఉన్న వారి మాటలు ఎలా ఉంటాయన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంటాయి కొందరు నేతల నోటి నుంచి వచ్చే మాటలు. తాజాగా బీజేపీ కీలక నేత.. కేంద్రహోం మంత్రి అమిత్ షా మాటల్నే తీసుకుంటే.. ఆశకు ఒక అంతుపొంతు ఉండాలన్న భావన కలుగక మానదు.

ఎంతటి శక్తివంతుడైనా కాలం ముందు అత్యంత బలహీనుడన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. తాజాగా అమిత్ షా మాటల్ని వింటే.. ఆయన ఆశకు అంతూపొంతూ ఉండదా? అన్న భావన కలుగక మానదు.

ఎందుకంటే.. ప్రధానమంత్రి పదవిలో నరేంద్ర మోడీ మూడు దశాబ్దాలు సాగుతారని పేర్కొనటమే. ఢిల్లీలో త్వరలో ఒక పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. మోదీ ఎట్‌ 20 డ్రీమ్స్‌ మీట్‌ డెలివరీ’ పేరిట బీజేపీ వెలువరిస్తు న్న పుస్తకంలో షా కీలక వ్యాఖ్యలు చేశారు.

మూడు దశాబ్దాల పాటు మోడీనే ప్రధానిగా కొనసాగుతారన్న ధీమాను వ్యక్తం చేయటం చూస్తే.. మోడీ మీద ఉన్న అభిమానంతో అమిత్ షా ప్రాక్టికాలిటీని సైతం మిస్ అవుతున్నారని చెప్పాలి.

ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ వయసు 71. ఆయన 63 ఏళ్ల వయసులో ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పటికి ఎనిమిదేళ్ల నుంచి ఆయన ప్రధానిగా ఉన్నారు. మొత్తం మూడు దశాబ్దాలు మోడీ దేశ ప్రధానిగా ఉండాలంటే.. మరో 22 ఏళ్ల పాటు కంటిన్యూ కావాల్సిందే.

అంటే.. మోడీ మాష్టారికి ప్రస్తుతం ఉన్న 71 ఏళ్లకు మరో 22 ఏళ్లు కలిపితే.. మొత్తం 93 ఏళ్లు అవుతుంది. అంటే.. మోడీకి తొంభై ఏళ్లు దాటిన తర్వాత కూడా ఆయనే ప్రధానమంత్రిగా అనుకోవటం ఏ మాత్రం నప్పలేదనే చెప్పాలి. కీలక స్థానాల్లో ఉన్న వారు తాము బలంగా ఉన్నప్పుడే.. వారి ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అమిత్ షా మాటలు వింటుంటే..ఆయన ఇప్పుడు ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.అమిత్ షా మాస్టారు మరేం చేస్తారో?