Begin typing your search above and press return to search.

అమిత్‌ షా విజ‌యం...ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం

By:  Tupaki Desk   |   23 May 2019 3:01 PM GMT
అమిత్‌ షా విజ‌యం...ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం
X
సంచ‌ల‌న సృష్టిస్తూ గుజ‌రాత్‌ లోని గాంధీన‌గ‌ర్ నుంచి బ‌రిలో దిగిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సునాయాసంగా గెలుపొందారు. ఇప్ప‌టివ‌ర‌కు బీజేపీ సీనియర్ నాయకుడు - మాజీ ఉపప్రధాని ఎల్‌ కే అద్వానీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానాన్ని అమిత్ షాకు కేటాయించి ఈ ప్రాంతంలో బ‌రిలో దిగారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అమిత్‌షా కే ఓట‌ర్లు జై కొట్టారు. 5 ల‌క్ష‌ల 81 వేల 831 ఓట్ల తేడాతో ఆయ‌న గెలుపొందారు.

అమిత్ షా తన రాజకీయ ప్రయాణాన్ని గాంధీనగర్ నుంచే మొదలుపెట్టారు. 2008లో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణకు ముందు అమిత్ షా సర్ఖేజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. అలాంటి చోట
సిట్టింగ్ ఎంపీ - బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన‌ అద్వానీకి బ‌దులుగా టికెట్ ఇచ్చారు. దీనిపై పార్టీలో మోడీ - షా వ్యతిరేక వర్గం - విపక్షాలు ఒంటికాలిపై విమర్శలు చేశాయి. అయిన‌ప్ప‌టికీ షా త‌న ప‌ని తాను చేసుకుపోయారు. నామినేషన్ వేసే సమయంలోనే మంది మార్బలంతో ర్యాలీ తీసిన షా ...త‌న‌దైన ప్ర‌చార త‌ర‌హాలో దూసుకుపోయారు. త‌ద్వారా, 5 లక్షల 81 వేల 831 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు.

గత ఎన్నికల్లో అద్వానీ 4 లక్షల 83 వేల 120 ఓట్లతో తన ప్రత్యర్థి ఈశ్వరిబాయి పటేల్‌ పై విజయం సాధించారు. ఆ ఎన్నికలో అద్వానీకి 7 లక్షల 73 వేల 539 ఓట్లు రాగా .. 2 లక్షల 90 వేల 419 ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. తాజాగా, అద్వానీ కన్నా 35 వేల ఓట్ల తేడాతో విజయం సాధించి త‌న స‌త్తాను చాటిచెప్పారు. కాగా, అమిత్ షా ఈ స్థాయిలో ఇంత మెజార్టీ సాధించ‌లేక‌పోతే...పార్టీలోని అంత‌ర్గ‌తంగా ఉన్న మోడీ అస‌మ్మ‌తి వాదులే మోడీ-షా ద్వ‌యంపై మండిప‌డే వార‌ని అంటున్నారు. అలాంటి అవ‌కాశం ఇవ్వ‌కుండా అమిత్‌షా త‌న‌ స‌త్తాను చాటుకున్నార‌ని అంటున్నారు.