Begin typing your search above and press return to search.

ట్విన్ స్టేట్స్ పై అమిత్ షా గన్

By:  Tupaki Desk   |   26 March 2017 12:16 PM IST
ట్విన్ స్టేట్స్ పై అమిత్ షా గన్
X
నార్త్ - నార్త్ ఈస్ట్ లో పాగా వేసిన బీజేపీ అదే ఊపులో సౌత్ లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలపై పట్టు సాధించాలని ప్లాన్ చేస్తుంది. ఇందుకు గాను రెండు రాష్ట్రాల్లోని పార్టీకి దిశా నిర్దేశం చేసేందుకు అమిత్‌ షా రెండు దశల్లో ఇక్కడ పర్యటించనున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఏప్రిల్ నెల తొలివారంలో మూడురోజుల పాటు హైదరాబాద్ - చివరి వారంలో లేదా మే మొదటి వారంలో విజయవాడలో రెండురోజుల పాటు మకాం వేస్తారని తెలుస్తోంది

కాగా అమిత్ షా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేశారట. ఆ మేరకు తమ పార్టీ నేతలను క్షేత్రస్థాయి కార్యక్రమాలకు సిద్ధం చేసే ప్రతిపాదనతో రానున్నారు. మొదటి నుంచి బూత్ కమిటీలపై సీరియస్‌ గా దృష్టి సారిస్తున్న ఆయన, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దానిపైనే దృష్టి కేంద్రీకరించనున్నారు. బూత్ కమిటీలు పూర్తి చేసి, ఒక ఓటరులిస్టులో ఉండే 30 మందికి ఒకరిని ఇన్చార్జిగా నియమించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని భావిస్తున్నారు.

అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాలంటూ తెలుగుదేశం, తెరాస ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో వాటి అవసరాన్ని మరోసారి చర్చించనున్నారు. ఇటీవల ఢిల్లీలో కొందరు నాయకులు అమిత్‌ షాను కలిసిన సందర్భంలో ఈ చర్చ వచ్చినట్లు సమాచారం. అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగితే అందుకు తగ్గట్లుగా కార్యాచరణ మార్చుకునేలా అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/