Begin typing your search above and press return to search.

బండి సంజయ్ కు అమిత్ షా ఫోన్

By:  Tupaki Desk   |   2 Nov 2021 1:34 PM GMT
బండి సంజయ్ కు అమిత్ షా ఫోన్
X
హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దూసుకుపోతున్నారు. బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ఫోన్ చేశారు. కౌంటింగ్, మోజార్టీ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. హుజురాబాద్ లో బీజేపీ విజయం ఖాయమని అమిత్ షాకు బండి సంజయ్ వివరించారు. కార్యకర్తలు తీవ్రంగా శ్రమించడం వల్లే హుజూరాబాద్ లో బీజేపీ విజయపథంలో పయనిస్తున్నాయని సంజయ్ తెలిపారు. బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండడం పట్ల అమిత్ షా అభినందనలు తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు.

హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ప్రతి రౌండ్‌ కౌంటింగ్‌ ఉత్కంఠభరితంగా సాగుతోంది. టీఆర్‌ఎస్‌ కేవలం రెండు రౌండ్లలోనే ఆధిక్యం కనబర్చింది. 14, 15 రౌండ్లు పూర్తి అయిన తర్వాతనే సంబరాలు చేసుకోవాలని బండి సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈటల 5వేలకుపైగా మెజారిటీలో కొనసాగుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉండడం పట్ల బీజేపీ శ్రేణులు ఉత్సాహంలో ఉన్నారు. కొన్నాళ్ల కిందట దుబ్బాకలో గెలిచిన తీరులోనే హుజూరాబాద్ కూడా తమ కైవసం అవుతోందన్న సంతోషం తెలంగాణ బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. గత ఏడాది నవంబర్‌లో దుబ్బాకలో బీజేపీ విజయం సాధించింది. హుజూరాబాద్ కూడా తమ కైవసం అవుతోందని తెలంగాణ బీజేపీ నేతలు సంతోషంలో మునిగి తేలుతున్నారు.

హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మధ్యే ప్రధాన పోటీ జరిగింది. ఎన్నికల కౌంటింగ్‌‌లో రౌండు రౌండుకూ బీజేపీ తన అధిక్యాన్ని ప్రదర్శిచింది. టీఆర్ఎస్ అభ్యర్థి సొంత గ్రామంలోనూ ఈటల తన ఆధిక్యాన్ని సాధించారు. గెల్లు శ్రీనివాస్‌ సొంత గ్రామం వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లోనూ ఆయన వెనుకబడ్డారు. ఇక్కడ ఈటల 191 ఓట్ల మోజారిటీ సాధించారు. ఓటర్లను ఆకర్షించేందుకు అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చివరకు ఓటర్లు మాత్రం ఈటల వైపే మొగ్గు చూపుతున్నారు. మొత్తంగా ఈటల భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.