Begin typing your search above and press return to search.
షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్న సౌదీ.. ఆ వీసాలు రద్దు
By: Tupaki Desk | 28 Feb 2020 10:46 AM ISTఅయితే ఆయిల్.. లేదంటే టూరిజం మీద మాత్రమే బతికే దేశాలు కొన్ని ఉంటాయి. ఆ కోవలోకే వస్తుంది సౌదీ అరేబియా. ఈ దేశంలో అయిల్ నిల్వలు ఎంత భారీగా ఉంటాయో తెలిసిందే. అంతకంతకూ తగ్గుతున్న ఆయిల్ నిల్వలు లేకున్నా.. తమ దేశానికి ఎలాంటి ఢోకా లేకుండా ప్రత్యామ్నాయంగా పర్యాటకాన్ని డెవలప్ చేసిన ఈ చిన్న దేశం తాజాగా షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది.
ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనా వైరస్ నేపథ్యంలో.. తమ దేశంలోకి ఈ వైరస్ ఎంట్రీ ఇచ్చేందుకు ఏ మాత్రం వీల్లేని విధంగా కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. తమ దేశానికి వచ్చే పర్యాటకుల వీసాల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చైనాలో షురూ అయిన కొవిడ్ వైరస్ అంతకంతకూ విస్తరిస్తూ పలు దేశాలకు పాకటమే కాదు.. ఇప్పటికే పలువురి మరణానికి కారణమైంది.
రోజులు గడుస్తున్నకొద్దీ కొవిడ్ వైరస్ విస్తరణకు చెక్ చెప్పలేకపోతున్నారు. దీంతో.. ఈ వైరస్ తమ దరిదాపుల్లోకి రాకుండా ఉండేందుకు వీలుగా పలు దేశాలు కఠిన నిర్ణయాల్ని తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తమ దేశానికి వచ్చే విదేశీ పర్యాటకులపై ఆంక్షల్ని విధించింది.
ఏటా లక్షలాది మంది టూరిజంలో భాగంగా సౌదీలో పర్యటించటం ఒకటైతే.. హజ్ యాత్ర కోసమే పాతిక లక్షల మంది వరకూ సౌదీకి వెళ్లి వస్తుంటారు. గత ఏడాది హజ్ యాత్రలో భాగంగా 25 లక్షల మంది సౌదీని సందర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చే హజ్ యాత్రికుల కారణంగా కొవిడ్ విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉండటంతో.. విదేశీయుల వీసాల్ని రద్దు చేస్తూ సౌదీ సంచలన నిర్ణయం తీసుకుంది.
అయితే.. ఈసారి హజ్ యాత్రకు ఆ దేశం అనుమతి పూర్తిగా ఇవ్వదా? లేదంటే ఎంపిక చేసిన దేశాలకే ఇవ్వదా? లాంటి సందేహాలు తీరాలంటే మరింత వివరణ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే విదేశీ పర్యాటకుల వీసాల్ని రద్దు చేస్తూ సౌదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ కొవిడ్ వైరస్ కు సంబంధించి ఒక్క అనుమానిత కేసు కూడా సౌదీలో వెలుగు చూడలేదు. ఇదిలా ఉంటే..సౌదీ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో మాత్రం కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. యూఏఈలో 13.. కువైట్ లో 43.. బహ్రెయిన్ లో 33.. ఒమన్ లో 4 కేసులు ఇప్పటివరకూ నమోదయ్యాయి. చైనా నుంచి క్రమంగా విస్తరిస్తున్న కొవిడ్ వైరస్ కు గల్ఫ్ దేశాలు గడగడలాడిపోతున్నాయి.