Begin typing your search above and press return to search.
మసకబారిన ప్రతిష్ట: అమెరికా, చైనా, రష్యా... వ్యాక్సీన్ రాజకీయం
By: Tupaki Desk | 6 Sept 2020 6:00 AM ISTకరోనా మహమ్మారి నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపులు వ్యాక్సీన్ వైపు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థలు కోలుకోవాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా అవసరమే. ఇప్పటికే రష్యా వ్యాక్సీన్ వచ్చింది. అయితే దీనిపై పూర్తి విశ్వాసం కనిపించడం లేదు. వివిధ దేశాలు వ్యాక్సీన్ తయారీలో నిమగ్నమయ్యాయి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఇక్కడి రాజకీయం టీకా చుట్టూ తిరుగుతోంది. అమెరికా, రష్యా, చైనాలో కరోనా వ్యాక్సీన్ రాజకీయాలకు వేదికగా మారుతోందని అంటున్నారు. ఈ దేశాల్లో పాలకులు ప్రజల్లో తమ పట్ల ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకునేందుకు వ్యాక్సీన్ అనే ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారట.
సాధారణంగా వ్యాక్సీన్ తయారీకీ ఏళ్లు పడుతుంది. కానీ కొన్ని నెలల్లోనే రష్యా వ్యాక్సీన్ తీసుకు వచ్చింది. వ్యాక్సీన్‌ను కొద్ది నెలల్లోనే పూర్తి చేయాలని ఫార్మా కంపెనీలపై ఆయా దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఇందుకు వారి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలే కారణంగా కనిపిస్తోందని అంటున్నారు. నవంబర్ 1 నాటికి కరోనా వ్యాక్సీన్ పంపిణీకి రాష్ట్రాలు సిద్ధం కావాలని ట్రంప్ సర్కార్ సూచించింది. అంటే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ట్రంప్ వ్యాక్సీన్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి కరోనా నియంత్రణలో ట్రంప్ దారుణంగా విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి.
వ్యాక్సీన్‌కు సంబంధించి శాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నామని, ఇందులో రాజకీయాలకు తావులేదని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు చెబుతున్నప్పటికీ, రాజకీయా ఒత్తిళ్ళు లేకుండా ఉండవని అంటున్నారు. వ్యాక్సీన్ ఎంత మేరకు సురక్షితం, దాని సామర్థ్యం ఏమిటనే అంశాలపై శాస్త్రీ ఆధారాలు లేకుండా వినియోగానికి అనుమతులు సరికాదని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ పౌఛీ అన్నారు. నిర్ణీత ప్రమాణాల ప్రకారం వ్యాక్సీన్ వచ్చే ఏడాది రావాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది.
ఇక రష్యా అయితే ఆగమేఘాల మీద ఆగస్ట్ 11నే వ్యాక్సీన్ తీసుకు వచ్చింది. దీనిపై చాలామంది ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా పుతిన్ ప్రతిష్ట మసకబారుతోందని, అందుకే వ్యాక్సీన్‌ను ఆయుధంగా ఉపయోగించుకున్నారని చెబుతున్నారు. జిన్‌పింగ్ ప్రతిష్ట కూడా చైనాలో మసకబారుతోంది. పైగా కరోనా వచ్చిందే డ్రాగన్ దేశం నుండి. వ్యాక్సీన్‌ను దౌత్య, ఆర్థికపరమైన ఆయుధంగా ఉపయోగించుకోవాలని చైనా చూస్తోందట.