Begin typing your search above and press return to search.

భారత్ పై ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్న అగ్రరాజ్యం

By:  Tupaki Desk   |   29 March 2021 11:46 AM IST
భారత్ పై ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్న అగ్రరాజ్యం
X
అగ్రరాజ్యం అమెరికా భారత్‌ తో పాటుగా ఇటలీ, టర్కీ, బ్రిటన్, స్పెయిన్ మొదలగు దేశాలపై ప్రతీకారవర్తక చర్యలకు సిద్ధం అవుతుంది. ఈ-కామర్స్ సేవలపై ఈ దేశాలు పన్ను విధించడాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనికి ప్రతీకార వర్తక చర్యలను యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ప్రతిపాదించారు. ఇండియా డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ పైన యూఎస్ ట్రేడ్ యాక్ట్ ‌‍లోని 301 సెక్షన్ కింద గత ఏడాది జూన్ నెలలో అమెరికా విచారణ చేపట్టింది. ఈ వ్యవహారం అమెరికా డిజిటల్ సేవల కంపెనీలపై పక్షపాతం చూపించేందిగా ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. అయితే , ఈ వాదనను భారత ప్రభుత్వం వ్యతిరేకించింది.

అయినప్పటికీ కూడా అమెరికా ప్రతికార చర్యలకే అమెరికా సిద్ధమవుతోంది. విచారణలో తేలిన అంశాల ఆధారంగా 301 సెక్షన్ కింద అమెరికా యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ప్రతీకార చర్యలను ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. దీని ప్రకారం మన దేశం నుండి అమెరికాకు ఎగుమతయ్యే చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఉత్పత్తులు, వెదురు, వజ్రాలు-రత్నాలు, ఫర్నీచర్, సిగరేట్ పేపర్ వంటి ఉత్పత్తులపై అదనంగా యాడ్ వెలారమ్ పన్నులు విధించే అవకాశం ఉంది. అమెరికా కంపెనీల నుండి మన దేశం ఎంతమేరకు డిజిటల్ సర్వీసెస్ టాక్స్ వసూలు చేస్తుందో దాదాపు అంతే మొత్తాన్ని మనదేశం నుండి వచ్చే వస్తువులపై పన్ను రూపంలో వసూలు చేయాలని అమెరికా భావిస్తోందట. అంచనాల ప్రకారం మనదేశంలో అమెరికా కంపెనీల నుండి వసూలు చేసే DST ప్రతి సంవత్సరం 5.5 కోట్ల డాలర్ల మేరకు ఉంటుందని అంచనా.

ప్రతీకార చర్యల్లో భాగంగా అమెరికా ప్రభుత్వం ఎంపిక చేసిన భారత ఉత్పత్తులపై 25 శాతం వరకు దిగుమతి సుంకం విధించే అవకాశం ఉంది. రొయ్య పిల్లలు, ఫర్నీచర్‌, బంగారు, వెండి ఆభరణాలు, బాస్మతి బియ్యం తదితర వస్తువులు ఈ జాబితాలో ఉండవచ్చు. అమెరికన్‌ కంపెనీలు మన ప్రభుత్వానికి ఏటా 5.5 కోట్ల డాలర్ల (సుమారు రూ.400 కోట్లు) మేర డిజిటల్‌ పన్ను చెల్లించాల్సి రావచ్చని అంచనా. డిజిటల్‌ పన్ను వివక్షపూరితం కాదని, ఈ-కామర్స్‌ కంపెనీలన్నింటికీ సమాన అవకాశాలు కల్పించడమే తమ ఉద్దేశమని భారత్‌ ఇదివరకే అమెరికాకు స్పష్టం చేసింది.