Begin typing your search above and press return to search.

ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల ఊస్టింగ్స్ ఇంకా నడుస్తున్నాయి

By:  Tupaki Desk   |   21 March 2023 8:00 AM GMT
ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల ఊస్టింగ్స్ ఇంకా నడుస్తున్నాయి
X
సాఫ్ట్ వేర్ కల చెదురుతోంది. ఒకప్పుడు డాలర్ల వేటలో పడి భారతీయులు అమెరికాకు వెళ్లి గొప్ప కొలువులు సాధించి బాగా సంపాదించేవారు. కానీ ఇప్పుడు సాఫ్ట్ వేర్ బూమ్ చెదిరిపోయింది. టెకీలకు గడ్డు రోజులు మొదలయ్యాయి.

మొదటగా ట్విట్టర్ ను టేకోవర్ చేసిన ఎలన్ మస్క్ మొదలుపెట్టిన తొలగింపుల పర్వం ఆ తర్వాత అన్ని సంస్థలు చేపట్టాయి. మాంద్యం అని.. రష్యా-ఉక్రెయిన్ ప్రభావం అంటూ ఉద్యోగులను ఊడగొట్టిన కార్పొరేట్ కంపెనీలు.. ఆరు నెలలు అయినా ఇంకా తొలగింపులు కొనసాగిస్తూనే ఉన్నాయి. తగ్గకపోగా పెరుగుతూనే ఉన్నాయి.

ఆర్థిక మాంద్యం పేరు చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల మెడపై ఇంకా కత్తి వేలాడుతూనే ఉంది. ఖర్చుల తగ్గింపు పేరిట ఉద్యోగులనే బలి చేస్తున్నారు కంపెనీలు.

తాజాగా అమెజాన్ సంస్థ మరో భారీ తొలగింపులకు సిద్ధమైంది.. దాదాపు 9వేల మందిని తొలగించడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే వేలమందిని తొలగించిన అమెజాన్ మరోసారి భారీ తొలగింపునకు సిద్ధమయ్యారు. అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ రాబోయే వారాల్లో కంపెనీ అదనంగా 9,000 మంది ఉద్యోగులను తొలగిస్తుందని ప్రకటించారు. 18,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపిన నవంబర్ -జనవరి మధ్య తొలగింపుల తర్వాత ఇది మరో భారీ తొలగింపులకు కంపెనీ సిద్ధం కావడం ఉద్యోగులను షాక్ కు గురిచేస్తోంది.

అమెరికాలో కొలువులు చేస్తూ హెచ్1బీ వీసాపై ఉంటున్న వారికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. వారు 60 రోజుల్లో జాబ్ కోల్పోతే మరో జాబ్ లో చేరాలి. లేదంటే కట్టుబట్టలతో దేశం దాటి వెళ్లిపోవాలి. ఇప్పటికే తొలగింపులతో జాబ్ లు దొరకడం కష్టమవుతున్న తరుణంలో మరిన్ని తొలగింపులతో సాఫ్ట్ వేర్ జాబులు దొరకడం గగనమవుతోంది. భారత్ లో పెద్దగా ఈప్రభావం లేకున్నా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల ఊస్టింగ్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో? ఎప్పుడు కుదుటపడుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.