Begin typing your search above and press return to search.

ఆకలితో అల్లాడిపోతున్న అమెరికా సైనిక కుటుంబాలు..

By:  Tupaki Desk   |   17 Nov 2021 12:30 AM GMT
ఆకలితో అల్లాడిపోతున్న అమెరికా సైనిక కుటుంబాలు..
X
అగ్రరాజ్యం అమెరికా..ఆ దేశ సైన్యాన్ని చూసి చాలా దేశాలు గడగడ లాడతాయి. అలాంటి అమెరికాలో దాదాపు లక్షా 60 వేల మంది సైనికులు తమ కుటుంబాలను పోషించుకోలేక పోతున్నారంటే నమ్మగలరా  ఆశ్చర్యం అనిపించవచ్చు. కానీ, ఇది చేదు నిజం అంటోంది ‘ఫీడింగ్ అమెరికా’ సంస్థ. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు సైనిక కుటుంబాలు అతలాకుతలమయ్యాయి. దీనితో ఆకలి కేకలు వారిని ఇబ్బంది పెడుతున్నాయి. దిగువస్థాయిలో పనిచేసే వారి జీతాలు కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. చాలా మంది సైనికుల భార్యలు కూడా కోవిడ్ సమయంలో ఉద్యోగాలు కోల్పోయారు అని ఫీడింగ్ అమెరికా వెల్లడించింది.  

కరోనా మహమ్మారికి ముందు చాలా మంది సైనికుల భార్యలు కూడా ఉద్యోగాలు చేసేవారు.  దీంతో రెండు ఆదాయాలతో కుటుంబం సమతుల్యంగా ఉండేది. కానీ కరోనా మహహ్మారి చాలామందిని అన్ ఎంప్లయీడ్ గా మార్చేసింది. దీంతో ఇంట్లో పిల్లలకు వేళకు తిండి లేని పరిస్థితి నెలకొంది. ‘ఈ కఠిన వాస్తవం సాధారణ అమెరికన్స్ కు తెలియకపోవచ్చు. కానీ సైన్యంలో చాలామందికి తెలుసు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంలో  మేము సభ్యులు.  మా కుటుంబాలకు మాత్రం ఫుడ్ దొరకడం లేదు.  ఈ పరిస్థితుల్లో దేశాన్ని కాపాడడం పై  వారు ఎలా దృష్టి పెట్టగలరు’ అని ఇరాక్ యుద్ధంలో రెండు కాళ్లు కోల్పోయిన బ్లాక్ హాక్ పైలట్ టేమీ డక్ వర్త్ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్య సైన్యంలోని అన్ని విభాగాల్లోనూ ఉందని సెయింట్ లూయిస్ లో ఫుడ్ బ్యాంక్ నిర్వహించే  నాప్ తెలిపారు.  కరెంటు బిల్లులు చెల్లించలేక, చీకట్లోనే తన కుటుంబంతో బతకడానికి సిద్ధమైన యువ సైన్యాధికారి గురించి తనకు తెలుసునని ఆమె చెప్పారు. ‘సైన్యం లోకి వెళ్ళిన తర్వాత ఒకరిని సాయం అడగడం చాలామంది అగౌరవంగా భావిస్తారు. అందుకే చాలా కుటుంబాలు తిండి దొరక్క ఇబ్బంది పడుతున్న బయటపడడం లేదు. సైన్యంలో దిగువ స్థాయి ర్యాంకుల్లో పనిచేసే  సైనిక కుటుంబాల్లో 29 శాతం మంది తమ పిల్లలకు వేళకు ఆహారం అందించలేకపోతున్నారు అని ఫీడింగ్ అమెరికా సంస్థ తెలిపింది. కరోనా సమయంలో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ భిన్న ప్రజలు నివసించే పెద్ద దేశమైనప్పటికీ సమర్థవంగా వ్యవహరించారని అమెరికా కాంగ్రెషనల్ ప్రతినిధులు మెచ్చుకున్నారు. ప్రజాస్వామిక విలువల ఆధారంగా ప్రజలూ ఈ మహమ్మారి కట్టడికి నడుం బిగించారని, అందుకే ఈ శతాబ్దంలో తీవ్రమైన మహమ్మారి కరోనాను ఎదుర్కోవడం సాధ్యమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.