Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ విడుదలకు సిద్ధమైన అమెరికన్ కంపెనీలు...!

By:  Tupaki Desk   |   28 Nov 2020 1:20 PM IST
వ్యాక్సిన్ విడుదలకు సిద్ధమైన అమెరికన్ కంపెనీలు...!
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా జోరు కొనసాగుతుంది. ప్రతిరోజు లక్షల్లో పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది. ప్రస్తుతం పలు కంపెనీలు తయారు చేసే వ్యాక్సిన్లు చివరి దశలో ఉన్నాయి. అతి త్వరలోనే వ్యాక్సిన్ వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగానే... అమెరికన్‌ కంపెనీలు ఫైజర్‌, మోడెర్నాలు దాదాపు 95శాతం ఫలితాలతో వ్యాక్సిన్‌ రిలీజ్‌ కు సిద్ధం అవుతున్నాయి.

వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి అయిన వెంటనే.. త్వరలోనే ఆ రెండు కంపెనీల టీకాలు అందుబాటులోకి రానున్నాయి. ఫైజర్‌, మోడెర్నా వ్యాక్సిన్‌లను mRNA టెక్నాలజీతో తయారు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ధర సుమారుగా 15వందల వరకూ ఉండొచ్చని అంటున్నారు. వీటితో పోల్చి చూస్తే.. ఇండియన్‌ మేడ్‌ కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌లు అతి తక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 13 కంపెనీలు ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరుకున్నాయి. అదే ఫైనల్‌ స్టేజ్‌. ఏ విధంగా చూసినా అతి త్వరలోనే కరోనా వ్యాక్సిన్‌ ప్రపంచ ప్రజలకు అందుబాటులోకి రావడం ఖాయం.