Begin typing your search above and press return to search.
అమెరికా పౌరసత్వం...ఇకపై అంత వీజీ కాదు
By: Tupaki Desk | 17 Nov 2020 9:00 AM ISTడొనాల్డ్ ట్రంప్ పుణ్యమా అంటూ గత నాలుగేళ్లుగా అమెరికాలో లోకల్ సెంటిమెంట్ బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. తమ ఉద్యోగాలను హెచ్ 1బీ తదితర వీసాల ద్వారా మిగతా దేశాల వారు కొట్టుకుపోతున్నారంటూ అమెరికన్లకు ట్రంప్ బ్యాచ్ నూరిపోసింది. ఇక, అధికారం తన చేతిలో ఉంది కదా అని ట్రంప్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, హెచ్ 1బీ తదితర వీసాల నిబంధనలు కఠినతరం చేశాడు. అంతేకాకుండా, వీసాల సంఖ్యను కూడా కుదించాడు. తాజాగా అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ బైడెన్ హయాంలో అయినా తమ వీసా, ఇమ్మిగ్రేషన్ కష్టాలు తొలుగుతాయని అంతా భావించారు. అయితే, వారికి ఆ కష్టాలు తొలగలేదని తాజాగా ది యూఎస్ సిటిజెన్ షిప్ & ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) చెబుతోంది. అమెరికా పౌరులు అయ్యేందుకు రాసే పరీక్ష(సివిక్ టెస్ట్) నిబంధనలను USCIS మరింత కఠినతరం చేసింది.
డిసెంబరు 1, 2020 తర్వాత అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసేవారు మౌఖికంగా పరీక్షకు హాజరు కావాల్సిందేనని కొత్త నిబంధనను USCIS తెచ్చింది. గతలో ఉన్న సివిక్ టెస్ట్ తో పోలిస్తే తాజా సివిక్ టెస్ట్ లో అమెరికా చరిత్ర, పౌర సమాజం గురించి మరిన్ని ప్రశ్నలు ఉండబోతున్నాయి. కొత్త సివిక్ టెస్ట్ కఠినంగా ఉండనుందని నిపుణులు అంటున్నారు. అమెరికా పౌరసత్వం పొందేవారిలో అధికంగా భారతీయులే ఉంటారని, వారికి ఈ కొత్త టెస్ట్ నిజంగా పరీక్ష పెట్టనుందని చెబుతున్నారు. సెప్టెంబర్ 30, 2019 నాటికి 61,843 మంది ఎన్నారైలు అమెరికా పౌరసత్వం పొందారు. మొత్తం పౌరసత్వం పొందినవారిలో భారతీయుల శాతం 7.5 గా ఉంది. అయితే, కొత్త టెస్టులో కూడా 60 శాతం మార్కులు వస్తే చాలు. కానీ, 20 ప్రశ్నలలో 12 ప్రశ్నలకు కచ్చితంగా సమాధానం చెబితేనే పాస్ అవుతారు. అయితే, 20 ఏళ్లుగా అమెరికాలో నివాసం ఉంటోన్న 65 ఏళ్లు పైబడిన వారికి పాత నిబంధనలే వర్తిస్తాయి.