Begin typing your search above and press return to search.

పసి పిల్లలన్న జాలి కూడా లేదు! అమెరికన్​ ఎయిర్​లైన్స్​ ఓవర్​ యాక్షన్​!

By:  Tupaki Desk   |   22 Sept 2020 5:00 PM IST
పసి పిల్లలన్న జాలి కూడా లేదు! అమెరికన్​ ఎయిర్​లైన్స్​ ఓవర్​ యాక్షన్​!
X
కరోనా టైం విమానయాన సంస్థలు కఠిన నిబంధనలు విధిస్తున్నాయి. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న ప్రస్తుత తరుణంలో ఇటువంటి నిబంధనలు అత్యవసరమే.. మన ఆరోగ్యం కోసం ఈ రూల్స్​ పెట్టారు కాబట్టి ప్రయాణికులు కూడా వీటిని బాగానే ఫాలో అవుతున్నారు. అయితే కొందరు విమానయాన సిబ్బంది మాత్రం చాలా ఓవర్​ యాక్షన్​ చేస్తున్నారు. నిబంధనల పేరుతో సున్నితత్వం కూడా కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఓ మహిళ తన రెండేళ్ల బాలుడిని తీసుకొని విమానం ఎక్కింది. ఆమె మాస్కు పెట్టుకున్నది. కుమారుడికి కూడా మాస్క్​ పెట్టింది. అయితే ఆమె రెండేళ్ల బాలుడు చీటికి మాటికి మాస్క్​ తీసేస్తున్నాడు. చిన్నపిల్లల్లో ఈ ప్రవర్తన సహజంగానే మనం చూస్తుంటాం. కాగా అత్యుత్సాహం ప్రదర్శించిన విమానయాన సిబ్బంది ఆ తల్లి బిడ్దతో పాటు విమానంలో ఉన్న ప్రయాణికులందరినీ కిందికి దింపివేసింది. రెండేళ్లు పైబడ్డ వారంతా మాస్క్​ పెట్టుకొని తీరాల్సిందేనని వాదించింది. చివరకు ప్రయాణికులంతా రిక్వెస్ట్​ చేస్తే ఆ తల్లీ బిడ్డను వెనక సీట్లో కూర్చోబెట్టారు. బాధితురాలి ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​ తో ఈ విషయం వెలుగు లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్​ వైరల్​ గా మారింది.


పోర్ట్స్‌ మౌత్‌ కి చెందిన రేచల్ స్టార్ డేవిస్ అనే మహిళ నార్త్ కరోలినా లోని షార్లోట్ నుంచి మాంచెస్టర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది. అమెరికన్ ఎయిర్‌ లైన్స్‌ కి చెందిన ఓ విమానం లో రేచల్ స్టార్ డేవిస్.. రెండేళ్ల కుమారుడి తో ప్రయాణించింది. ‘విమానం ఎక్కిన తర్వాత నా కొడుకు మాస్క్ పెట్టుకోనంటూ అరిచి గీ పెట్టాడు. ఎంత చెప్పినా వినకుండా ఏడుస్తూ తనకు పెట్టిన మాస్క్ తీసేస్తున్నాడు. అదే సమయంలో సిబ్బంది పరుగున వచ్చింది. మమ్మల్ని, మాతోపాటు ప్రయాణికులందరినీ కిందకు దింపివేశారు. చివరకు ప్రయాణికులంతా ఎంతో బతిమాలగా మమ్మల్ని వెనకసీట్లో కూర్చొనేందుకు అనుమతించారు అని ఆమె పోస్టులో పేర్కొన్నది. ప్రస్తుతం ఈ పోస్టుకు దాదాపు రెండు లక్షల మంది లైక్ కొట్టారు. ‘విమానసిబ్బంది వాళ్ల డ్యూటీ వాళ్లు చేశారు’ ‘ చిన్నపిల్లల పట్ల ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా’ అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ‘సదరు మహిళతో మేము మాట్లాడాం. కేవలం ప్రయాణికుల క్షేమం కోసం ఇటువంటి నిబంధనలు మేము తీసుకొచ్చాం. అంతేకాని వారిని ఇబ్బంది పెట్టేందుకు కాదు’ అంటూ అమెరికన్ ఎయిర్‌లైన్స్ వివరణ ఇచ్చింది.