Begin typing your search above and press return to search.
73 యుద్ధ విమానాలు నిర్వీర్యం .. తాలిబన్ల కి అమెరికా షాక్ !
By: Tupaki Desk | 31 Aug 2021 7:15 PM ISTఆఫ్ఘానిస్తాన్ నుండి అమెరికా సైన్యం నిన్న అర్ధరాత్రి సమయానికి పూర్తిగా వెళ్లిపోయింది. అమెరికా అధ్యక్షుడు చెప్పిన సమయం కంటే ఒకరోజు ముందే అమెరికా ఆఫ్ఘన్ నుండి పూర్తిగా వెళ్లిపోయింది. సోమవారం కాబూల్ నుంచి చివరి విమానం బయలుదేరినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ ఫ్రాంక్ మెకెంజీ తెలిపారు. సుమారు రెండు వారాల పాటు ఆఫ్ఘన్ నుంచి తమ సేనలను, కొంతమంది ఆఫ్ఘన్ పౌరులను తీసుకొచ్చేందుకు అగ్రరాజ్యం ఎయిర్‌లిఫ్ట్ చేపట్టింది.
ఈ క్రమంలో ఆగస్టు 26న జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 13 మంది అమెరికన్ సర్వీస్ సభ్యులు, దాదాపు 169 మంది ఆఫ్ఘన్ పౌరులు మరణించారు. 20 ఏళ్ల క్రితం 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై జరిగిన దాడికి ప్రతీకారంగా, ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా, దాని అధినేత బిన్ లాడెన్ ను హతమార్చడమే లక్ష్యంగా ఆఫ్ఘనిస్థాన్ లోకి అడుగుపెట్టింది. రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశం కాకుండా అడ్డుకుంది. అయితే , చివరికి అనుకున్నదే జరిగింది. అలా అమెరికా వెనక్కి తగ్గగానే మళ్లీ ఆఫ్ఘానిస్తాన్ తాలిబన్ల వశం అయ్యింది.
అమెరికా ఆఫ్ఘన్ ను ఖాళీ చేసి వెళ్ళిపోతున్న నేపథ్యంలో అప్గన్ గడ్డ పై పదుల సంఖ్యలో తమ యుద్ధ విమానాలు, సైనిక వాహనాలు, అత్యాధునిక రాకెట్ రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేసినట్టు అమెరికా సైనిక అధికారి తెలిపారు. సెంట్రల్ కమాండ్ చీఫ్ జనరల్ కెన్నెత్ మెకెంజీ మాట్లాడుతూ, 73 యుద్ధ విమానాలను కాబూల్ లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తుక్కుగా చేసి నిరుపయోగంగా మార్చినట్టు వెల్లడించారు.
తాలిబన్ అధీనంలోకి అఫ్గన్ వెళ్లడంతో అక్కడ నుంచి రావడానికి ముందే అమెరికా సైన్యాలు వీటిని నిర్వీర్యం చేశారు. ఆ యుద్ధ విమానాలు ఎప్పటికీ ఎగరలేవు. వాటి ఏ ఒక్కరూ నడపలేరు. వాటిలో చాలా వరకూ యుద్ధం మొదలుపెట్టగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. కానీ ఖచ్చితంగా మళ్లీ ఎగరలేవు అని వెల్లడించారు. కాబూల్ విమానాశ్రయంలో 6,000 మంది సైనికులు మోహరించి ఆగస్టు 14 నుంచి తరలింపు ప్రక్రియ మొదలుపెట్టామని, అక్కడ మిలియన్ డాలర్ల విలువైన 70 ఎంఆర్ ఏపీ యుద్ధ వాహనాలను వదిలిపెట్టామన్నారు.అలాగే, రాకెట్, మోర్టార్, ఆయుధాల దాడులను సమర్థంగా ఎదుర్కొనే సీ-రామ్ వ్యవస్థను కూడా అక్కడే వదిలిపెట్టింది.
ఈ వ్యవస్థ సాయంతోనే సోమవారం కాబూల్ విమానాశ్రయంపై ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన రాకెట్ దాడులను అడ్డుకున్నారు. ఆ వ్యవస్థలను చివరి నిమిషం వరకు వినియోగించామని మెకెంజీ తెలిపారు. అమెరికా రక్షణ దళాలతో కూడిన చివరి విమానం అఫ్గనిస్థాన్ నుంచి సోమవారం అర్ధరాత్రి బయలు దేరింది. దీంతో అఫ్గన్ గడ్డ నుంచి 20 ఏళ్ల అనంతరం అమెరికా రక్షణ దళాలు పూర్తిగా వైదొలగాయి. ఈ విషయాన్ని అమెరికా రక్షణశాఖ కార్యాలయం ప్రకటించింది. ఆది నుంచి తీవ్ర శత్రుత్వం ఉన్నప్పటికీ అఫ్గన్ నుంచి అమెరికా దళాలు, పౌరుల ఉపసంహరణలో తాలిబన్లు చాలా సహకరించారని, ఉపయుక్తంగా ఉన్నారని ఈ సందర్భంగా మెకంజీ పేర్కొన్నారు. మరోవైపు అమెరికా పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోవడంతో తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు.