Begin typing your search above and press return to search.

కొరియా ద్వీపకల్పంలో అణు బాంబర్లు.. ఉద్రిక్తంగా పరిస్థితులు..!

By:  Tupaki Desk   |   21 Dec 2022 4:30 PM GMT
కొరియా ద్వీపకల్పంలో అణు బాంబర్లు.. ఉద్రిక్తంగా పరిస్థితులు..!
X
నార్త్ కొరియా లక్ష్యంగా అమెరికా... సౌత్ కొరియాలు కొరియా ద్వీపకల్పంలో యుద్ధ విన్యాసాలు చేపట్టాయి. ఇందులో భాగంగా అణు బాంబులను ప్రయోగించే అమెరికా యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. వీటితో పాటుగా స్టెల్త్ ఫైటర్ జెట్లు కొరియా ద్వీపకల్పంలో చక్కర్లు కొట్టాయి. దీంతో అక్కడ పరిస్థితులన్నీ ఉద్రిక్తంగా మారాయి.

అంతేకాకుండా నార్త్ కొరియా తయారు చేస్తున్న నిఘా ఉపగ్రహం సామర్థ్యంపై అమెరికా.. దక్షిణ కొరియాలు అనుమానం వ్యక్తం చేయడంపై నార్త్ కొరియా అధినేత కిమ్ సొదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి ఖండాతర క్షిపణిని ప్రయోగిస్తామని కిమ్ యో జోంగ్ హెచ్చరించారు.

ఈ క్రమంలోనే అమెరికా.. ఉత్తర కొరియాలు కొరియా ద్వీపకల్పంలో యూఎస్ బీ52ఎస్ యుద్ధ విమానాలు.. ఫైట్ జెట్టర్లు.. దక్షిణ కొరియాకు చెందిన ఎఫ్ 35.. ఎఫ్ 15 యుద్ధ విమానాలు విన్యాసాల్లో పాల్గొన్నాయి. ద్వీపకల్పంలోని సముద్ర జలాలపై భీకర శబ్దం చేస్తూ నింగిలో చక్కర్లు కొట్టాయి.

నాలుగేళ్ల తర్వాత అమెరికా తన ఎఫ్22 యుద్ధ విమానాన్ని ఉత్తర కొరియాలో మోహరించి తమను లక్ష్యంగా చేసుకుంటే చావు దెబ్బ తప్పదనే సంకేతాన్ని నార్త్ కొరియాకు పంపించాయి. శత్రు దేశంపై గూఢచార్యం చేసే నిఘా ఉపగ్రహం తయారీలో భాగంగా ఉత్తర కొరియా ఇటీవలే టెస్ట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది.

దీంతో అక్కడి నుంచి ప్రత్యర్థి నార్త్ కొరియా రాజధానితోపాటు ఇతర నగరాలను ఫొటో తీసింది. ఈ మేరకు తన ప్రయోగాల్లో ముందడుగు పడినట్లు ప్రకటించింది. ఈ ఫొటోలను పరిశీలించిన సౌత్ కొరియా ఆ ఫొటోలు అస్పష్టంగా ఉన్నాయని నిఘాకు పనికి రావని స్పష్టం చేశారు. అలాగే అమెరికా క్షిపణులను ఎదుర్కొనే సామర్థ్యం నార్త్ కొరియాకు లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ విమర్శలపై ఉత్తర కొరియా అధినేత సొదరి కిమ్ యో జోంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నార్త్ కొరియా సైనిక సామర్థ్యాన్ని తక్కువ చేసి చూస్తున్నారని.. కేవలం టెస్ట్ శాటిలైట్ తో రెండు ఫొటోలు తీసిన తమను అంచనా వేయలేమన్నారు. కుక్కలు మోరిగితే తాము పట్టించుకోమంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీటిన్నింటిని ఖండాంతర క్షిపణి ప్రయోగంతోనే సమాధానం చెబుతామని కిమ్ యో జోంగ్ హెచ్చరించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.