Begin typing your search above and press return to search.
చైనాతో అమెరికాయుద్ధం చేయనుందా? ఈ మాట చెప్పిందెవరో తెలుసా?
By: Tupaki Desk | 7 Oct 2021 7:00 PM ISTనోరు విప్పితే చాలు.. సంచలన వ్యాఖ్యలు చేసే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్ గా మారాయి. తైవాన్ గగనతలం మీద చైనా యుద్ధ విమానాలు దూకుడు పెరుగుతున్న వేళ.. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి చూస్తుంటే.. చివరకు చైనాతో అమెరికా యుద్దం చేసేలా ఉందన్నారు.
అమెరికాలో ప్రస్తుతం బలహీన.. అవినీతి ప్రభుత్వాన్ని చైనా ఏ మాత్రం గౌరవించటం లేదన్నారు. త్వరలో చైనా.. అమెరికా ఉన్నత స్థాయి అధికారుల సమావేశం స్విస్ లో జరగనున్న నేపథ్యంలో ట్రంప్ నోటి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లుగా మరోసారి ఆరోపించిన ట్రంప్.. తన దేశాన్ని అవినీతి ప్రభుత్వం పాలిస్తుందన్నారు.
అఫ్గాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ సమయంలో బైడెన్ సర్కారు అనుసరించిన తీరును తప్పు పట్టిన ట్రంప్.. 8500 కోట్ల డాలర్ల విలువైన అత్యాధునిక సైనిక పరికరాలను ఆ దేశంలో వదిలిరావటం ఏమిటని ప్రశ్నించారు. వాటిని ఇప్పుడు చైనా.. రష్యాలు రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా సొంతం తయారు చేసుకుంటాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఏమైనా డ్రాగన్ దేశంతో అగ్రరాజ్యం యుద్ధం చేస్తుందంటూ ట్రంప్ నోటి మాట సంచలనంగా మారింది.