Begin typing your search above and press return to search.

చైనాకి భారీ షాక్ ... 24 చైనా కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టిన అగ్రరాజ్యం , అలాంటి వారిపై ఆంక్షలు !

By:  Tupaki Desk   |   27 Aug 2020 9:15 AM IST
చైనాకి భారీ షాక్ ... 24 చైనా కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టిన అగ్రరాజ్యం , అలాంటి వారిపై ఆంక్షలు !
X
ప్రపంచంలో ఎవరెన్ని చెప్పినా కూడా చైనా తన కవ్వింపు చర్యలు మాత్రం తగ్గించుకోవడం లేదు. ఇలాంటి తరుణంలోనే అగ్రరాజ్యం అమెరికా చైనా కి భారీ షాక్ ఇచ్చింది. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతాల్లో కృత్రిమ ద్వీపాలు నిర్మిస్తుండటం పై ఆగ్రహం వ్యక్తం చేసిన యూఎస్.. చైనాకి చెందిన 24 కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టింది. అలాగే దీనికి కారణమైన అధికారులపైనా ఆంక్షలు కఠినతరం చేసింది. చైనా షిప్ నిర్మాణ గ్రూపులో భాగమైన చైనా కమ్యూనికేషన్స్ కన్‌ స్ట్రక్చన్ కో, టెలికమ్యూనికేషన్ సంస్థలతోపాటు మరో 24 కంపెనీలను బుధవారం అమెరికా బ్లాక్ ‌లిస్టులో పెట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు వ్యతిరేకిస్తున్నప్పటకి కూడా సౌత్ చైనా సముద్రంలోని దీవుల్లో సైనిక బలగాలను మోహరిస్తున్న క్రమంలో అమెరికా ఈ చర్యకు దిగింది. దక్షిన చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతాల్లో కృత్రిమ దీవులను నిర్మించి వాటిలో చైనా తమ మిలిటరీ బలగాలను మోహరిస్తోందని యూఎస్ కామర్స్ డిపార్ట్ ‌మెంట్ వెల్లడించింది. దక్షిణ చైనా సముద్రంలోని సుమారు 3వేల ఎకరాల వివాదాస్పద ప్రాంతాన్ని దక్కించుకునేందుకు 2013 నుంచీ చైనా కుట్రలు చేస్తుంది . ఈ చర్య ఇరుగుపొరుగు దేశాల సార్వభౌమత్వానికి సవాలుగా మారింది. అలాగే , ప్రకృతిని కాలుష్యం చేసేదిగా ఉందని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో అన్నారు. ఈ నేపథ్యంలోనే చైనాకి చెందిన 24 కంపెనీలని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. చైనాకు చెందిన 24 కంపెనీలు బ్లాక్ లిస్టులోకి చేరడంతో ఇక అమెరికా ఆ సంస్థలకు ఎలాంటి వస్తువులను, సరుకులను అందించబోదు. అంతేగాక, సౌత్ చైనా సముద్రంలో కార్యకలాపాలకు సహకరించిన వారెవరికి కూడా అమెరికా వీసాలను ఇవ్వదు అని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పాంపియో స్పష్టం చేశారు.