Begin typing your search above and press return to search.
అమెరికా : కాల్పుల్లో నలుగురు సిక్కులు మృతి .. సంతాపంగా జెండా అవనతం !
By: Tupaki Desk | 17 April 2021 9:39 AM ISTఅమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఇండియానా పోలిస్ లో జరిగిన కాల్పుల ఘటనలో మొత్తం ఎనిమిది మంది మరణించారు. ఆ ఎనిమిది మంది మృతుల్లో నలుగురు సిక్కు వ్యక్తులు ఉన్నట్లు ఆ కమ్యూనిటీ తెలిపింది. ఇక కాల్పులకు తెగబడిన నిందితుడు 19 ఏళ్ల బ్రాండన్ స్కాట్ హోల్ ఈ ఘటన తర్వాత ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఇండియానా పోలిస్ విమానాశ్రయం సమీపంలోని ఫెడెక్స్ కార్గో డెలివరీ సంస్థ కార్యాలయం వద్ద ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో పనిచేస్తున్నవారిలో 90శాతం భారత సంతతి అమెరికన్లే కావడం గమనార్హం. ఇది అత్యంత హృదయవిదారక సంఘటన.ఈ ఘటనతో సిక్కు కమ్యూనిటీ దిగ్భ్రాంతికి గురైంది.' అని ఇండియానా పోలిస్‌లోని సిక్కు కమ్యూనిటీ నేత గురీందర్ సింగ్ ఖల్సా తెలిపారు. కాల్పుల ఘటన తర్వాత ఫెడెక్స్ కార్గో డెలివరీ కార్యాలయానికి వెళ్లిన ఆయన, అక్కడ పనిచేస్తున్నవారితో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
ఈ కాల్పుల ఘటనపై అమెరికా అధినేత జో బైడెన్,ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న జపాన్ ప్రధాని యోషిషిండే సుగా కూడా కాల్పుల ఘటనపై స్పందించారు. అమాయక పౌరుల పట్ల ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగకూడదన్నారు. ఇండో-పసిఫిక్ రీజియన్ లో స్వేచ్చ,ప్రజాస్వామ్యం,మానవ హక్కులు,రూల్ ఆఫ్ లా,ప్రపంచ శ్రేణి విలువలు ప్రబలంగా ఉండాలని కోరుకున్నారు. కాల్పుల ఘటనలో చనిపోయినవారికి సంతాపంగా వైట్ హౌస్ సహా అమెరికాలోని అన్ని ఫెడరల్ బిల్డింగ్స్ పై జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. ఇండియానా పోలిస్ లో దాదాపు 10వేల మంది సిక్కులు నివసిస్తున్నారు. తాజాగా ఘటన నేపథ్యంలో భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు విజ్నప్తి చేశారు.