Begin typing your search above and press return to search.

అమెరికా కౌంటింగ్ క్లైమాక్స్.. ఎవరు గెలుస్తారు?

By:  Tupaki Desk   |   4 Nov 2020 4:30 PM GMT
అమెరికా కౌంటింగ్ క్లైమాక్స్.. ఎవరు గెలుస్తారు?
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం తుది అంకానికి చేరింది. పోరు హోరాహోరీగా సాగుతోంది. ఒక్కో రాష్ట్రంలో ఫలితాలు వెలువడే కొద్ది గెలుపు అవకాశాలు మారుతున్నాయి. ఒక్కో రాష్ట్రం ఫలితాలు చూస్తుంటే అధ్యక్షుడు ట్రంప్, ప్రత్యర్థి జోబిడెన్ మధ్య ఆధిపత్యం మారుతోంది. విజయం అనేది దోబూచులాడుతోంది. ఇద్దరూ టఫ్ ఫైట్ ఇస్తున్నారు.

అమెరికా ఎన్నికల ఫలితాల్లో గంటగంటకు ఫలితాల సరళి మారుతోంది. దీంతో అమెరికాలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ప్రపంచదేశాలన్నీ అమెరికా అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.

బుధవారం రాత్రి వరకు అందిన సమాచారం.. జోబిడెన్ 238 స్థానాలు, డొనాల్డ్ ట్రంప్ 213 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించాడు. బిడెన్ ప్రస్తుత స్వల్ఫ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా కీలకమైన రాష్ట్రాల్లో ఫలితాలు తేలాల్సి ఉంది.

అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రానికి 50 ఎలక్ట్రోరల్ ఓట్లు ఉంటాయి. ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగా ఇవి ఉంటాయి. పెద్ద రాష్ట్రమైన టెక్సాస్ లో 25 మిలియన్ల జనాభాకు గాను 36 ఎలక్ట్రోరల్ ఓట్లు ఉంటాయి. చిన్న రాష్ట్రమైన వెర్మాంట్ లో 0.5 మిలియన్ల జనాభాకు గాను ఒక ఎలక్ట్రోరల్ ఓటు మాత్రమే ఉంటుంది. దీనికి తోడు ప్రతి రాష్ట్రానికి ఇద్దరు సెనెటర్లు ఉంటారు. వీరి ఓట్లను కలిపితే టెక్సాస్ లో 38 ఎలక్ట్రోరల్ ఓట్లు ఉంటాయి. వెర్మాంట్ కు 3 ఎలక్ట్రోరల్ ఓట్లు ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే ఆ రాష్ట్రానికి కేటాయించిన ఎలక్ట్రోరల్ ఓట్లు ఆ అభ్యర్థి సొంతం అవుతాయి.

50 రాష్ట్రాల్లో మొత్తం 538 ఎలక్ట్రోరల్ ఓట్లలో అధ్యక్షుడిగా గెలవాలంటే 270 ఎలక్ట్రోరల్ ఓట్లు (మ్యాజిగ్ ఫిగర్) రావాలి.

+ఇప్పటిదాకా ఫలితాలు తేలిన రాష్ట్రాల వారీగా చూస్తే.. (ఎలక్టోరల్ ఓట్లు)
*జార్జియాలో 16 ఓట్లు ట్రంప్ కు వచ్చే అవకాశం ఉంది
*నార్త్ కరోలినాలో ట్రంప్ కు 15 ఓట్లు రావచ్చంటున్నారు
*విస్కాన్సిన్ ఎలక్టోరల్ ఓట్లు -10 ఇక్కడ ట్రంప్ కే మెజార్టీ ఉంది.
*మిచిగాన్ ఎలక్టోరల్ ఓట్లు-16 : ట్రంప్, జోబిడెన్ హోరాహోరీ నడుస్తోంది.
*నెవెడా (ఎలక్టోరల్ ఓట్లు-6): ఇక్కడ జోబిడెన్ కే అనుకూలంగా ఉంది.
*పెన్సిల్వేనియా (ఎలక్టోరల్ ఓట్లు -20): ఇక్కడ బిడెన్, ట్రంప్ హోరాహోరీ ఉంది. ఎవరికి మెజార్టీ వస్తుందో చెప్పలేని పరిస్థితి
*అలస్కా (ఎక్టోరల్ ఓట్లు -3):ఇక్కడ ట్రంప్ మెజార్టీలో ఉన్నారు.

ఓవరాల్ గా విస్కాన్సిన్, జార్జియా, నార్త్ కరోలినా, ట్రంప్ ఖాతాలోకి వస్తే 257 సీట్లు వచ్చే అవకాశం ఉంది.

ఇక మిచిగాన్, నెవెడా జోబిడెన్ ఖాతాలోకి వస్తే.. 260 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య కేవలం 3 ఓట్ల తేడా మాత్రమే ఉండనుంది.

హోరాహోరీ పోరులో ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠగా మారింది. పెన్సిల్వేనియా కీలకంగా మారింది. ఇక్కడ ఎవరు గెలిస్తేవారిదే అధికారం. చాలా తక్కువ మెజార్టీతోనే ఎవరైనా గెలుస్తారు.

*అమెరికా ఎన్నికల ఫలితాల సవాల్ కు ట్రంప్ మొగ్గు
ఒక వేళ ట్రంప్ ఈ ఎన్నికల ఫలితాలను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే మలుపు తిరుగుతుంది. ఈరోజు సవాల్ చేస్తానని ట్రంప్ ప్రకటించారు. దీంతో స్థానిక ఎన్నికల అధికారులు బ్యాలెట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. పార్టీ లీగల్ టీములు ఈ ఫలితాలను రాష్ట్రాల కోర్టుల్లో సవాల్ చేస్తాయి. రాష్ట్రాల పిటీషన్లు స్వీకరించి ఓట్ల రీకౌంటింగ్ కు ఆదేశించవచ్చు.. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు రాష్ట్ర కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరవచ్చు. రీకౌంటింగ్ అనంతరం అధ్యక్షుడు ఎవరనేది తేలుతుంది.