Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ చివరి నాటికి అమెరికా కరోనా ఫ్రీ

By:  Tupaki Desk   |   24 May 2020 7:27 AM GMT
సెప్టెంబర్ చివరి నాటికి అమెరికా కరోనా ఫ్రీ
X
ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి విషయంలో అంతో ఇంతో పురోగతి ఉంది. కానీ కేసులు, మరణాల విషయంలో ఏమాత్రం తగ్గకుండా అగ్రరాజ్యం అమెరికా ముందుకెళుతోంది. మహమ్మారిని కంట్రోల్ చేయలేక అగ్రరాజ్యం ఆపసోపాలు పడుతోంది. అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ ఎత్తివేస్తుండడంతో కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది.

ప్రపంచంలోనే అమెరికా ఇప్పుడు అత్యధిక పాజిటివ్ కేసులతో అగ్రస్థానంలో ఉంది. 1లక్ష మరణాలు.. 1.64 మిలియన్లకు పైగా కేసులు అమెరికాలో నమోదయ్యాయి.

అమెరికాలో కేసులు తగ్గడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదట.. రెండో దశ తీవ్రంగా ఉండబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంచనాలు, ఆరోగ్య నిపుణులు సైతం ఆందోళన చెందుతున్నారు.

అయితే సింగపూర్ కు చెందిన శాస్త్రవేత్తల బృందం మాత్రం సెప్టెంబర్ చివరి నాటికి అమెరికా ఈ మహమ్మారి వైరస్ నుంచి విముక్తి పొందగలదని.. డిసెంబర్ చివరి నాటికి మహమ్మారి ముగింపును ప్రపంచం మొత్తం చూస్తుందని ఒక నివేదికను బయటపెట్టింది.

ప్రస్తుత పాజిటివ్ కేసులు.. మరణాల డేటాను విశ్లేషించిన సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ తాజాగా వైరస్ వ్యాప్తి స్వభావాన్ని అంచనా వేయడానికి గణిత నమూనాను తీసుకువచ్చింది. ‘ప్రిడిక్టివ్ మానిటరింగ్’ పేరుతో చేసిన ఈ అంచనా ప్రకారం.. సెప్టెంబర్ 20 నాటికి అమెరికా వైరస్ రహితంగా మారుతుందని.. ఆగస్టు 27నాటికి యూకే లో వైరస్ అంతమవుతుందని తెలిపింది.

అయితే పరిస్థితి చూస్తుంటే చలికాలం వచ్చే వరకు మరింత కేసులు పెరిగేలానే కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినా కంట్రోల్ కాని వైరస్ ఇప్పుడు తగ్గుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.