Begin typing your search above and press return to search.
ఫేస్బుక్ కాదు ఫేక్‌బుక్.. సెలబ్రిటీల ఆరోపణ
By: Tupaki Desk | 16 Sept 2020 11:15 AM ISTప్రపంచం లోనే అతిపెద్ద సోషల్ నెట్ వర్క్ అయిన ఫేస్ బుక్ పై అమెరికాకు చెందిన సెలబ్రిటీలు పగబట్టారా? ఫేస్బుక్లో ద్వేషపూరిత ప్రచారాలు, తప్పుడు సమాచారం వస్తున్నదని వారు నమ్ముతున్నారో.. అంటే అవుననే సమాధానమే వస్తున్నది. గత 24 గంటల్లో చాలా మంది సెలబ్రిటీలు ఫేస్బుక్లో ఒక్కపోస్ట్ కూడా చేయలేదట. వీరంతా మూకుమ్మడిగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్ లో ద్వేషపూరిత ప్రచారాలు, విద్వేష ప్రసంగాలపై నిషేధం విధించాలన్న డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతన్నది. నిరసన లో భాగంగా కిమ్ కిమ్ కర్దషియన్ తో సహా ప్రముఖులు చాలామంది 24 గంటలుగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. లియోనార్డో డికాప్రియో, సాచా బారన్ కోహెన్, కాటి పెర్రీ, మైఖేల్ బి. జోర్డాన్ వంటి స్టార్స్ అందరూ ‘స్టాప్ హేట్ ఫర్ ప్రాఫిట్’ పేరిట నిర్వహిస్తున్న నిరసనకు మద్దుతు తెలిపారు.
ఇన్‌స్టా, ఫేస్ బుక్ వెంటనే తమ నిబంధనలు సడలించాలని.. తప్పుడు సమాచారాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ‘ప్రపంచంలోనే అతి పెద్దవైన సామాజిక మధ్యమాలు తప్పుడు ప్రచారాన్ని, విద్వేష పూరిత ప్రసంగాలను ఉద్దేశపూర్వకంగా వ్యాపింపజేస్తున్నప్పడు మేము ఎందుకు మౌనంగా ఉండాలి’ అంటూ వారు అమెరికాకు చెందిన సెలబ్రిటీలు వ్యాఖ్యానించారు. అమెరికాను విభజించేందుకు కొందరు కుట్రలు పన్నారు. ఈ కుట్రలకు ఈ సామాజికమాధ్యమాలు సహకరిస్తున్నాయి. అంటూ కర్దషియాన్ ఆరోపించారు. ఆమెకు ఇన్‌స్టా గ్రామ్ లో 188 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 2016 అమెరికా ఎన్నికల సమయంలోనూ రష్యా తప్పుడు ప్రచారాన్ని ఫేక్ వార్తలను ఫేస్ బుక్ అరికట్ట లేకపోయిందని ఆరోపణలు ఉన్నాయి. సెలబ్రిటీలు ఫేస్బుక్ ను వాడకపోయినప్పటికీ.. సంస్థకు ఏమాత్రం ఆదాయం తగ్గలేదు. ఈ 24 గంటల్లో 5.2 బిలియన్ డాలర్ల విలువైన యాడ్ రెవెన్యూ వచ్చింది.