Begin typing your search above and press return to search.

చైనా దూకుడుకు అమెరికా బ్రేకులు ?

By:  Tupaki Desk   |   11 Oct 2021 11:17 AM IST
చైనా దూకుడుకు అమెరికా బ్రేకులు ?
X
బలహీనంగా ఉన్న దేశాలను, దీవులను ఆక్రమించుకోవడం చైనాకు చాలా అలవాటు. ఆ అలవాటు ప్రకారమే పొరుగునే అంటే కేవలం 150 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న స్వతంత్ర దేశం తైవాన్ ను ఎప్పుడెప్పుడు కబ్జా చేసేద్దామా అని డ్రాగన్ తెగ ఆరాటపడుతోంది. ఇందులో భాగంగానే వరుసగా తైవాన్ భూభాగంలోకి ప్రవేశించి మరీ వైమానిక విన్యాసాలు చేస్తోంది. ఒక దేశం అనుమతి లేకుండా ఆ దేశపు భూభాగంలోకి ప్రవేశించి విన్యాసాలు చేయటం నిషిద్ధం. ఈ విషయం చైనాకు బాగా తెలిసినా కావాలనే తైవాన్ లోకి చైనా వైమానిక దళాలు పదే పదే ప్రవేశిస్తున్నాయి.

అనుమతి లేకుండా ప్రవేశించటమే కాకుండా తైవాన్ సైన్యాన్ని బాగా రెచ్చగొడుతోంది. అంటే ఏదో రోజు కచ్చితంగా తైవాన్ ను కబ్జా చేయడం డ్రాగన్ ఉద్దేశ్యమని యావత్ ప్రపంచానికి బాగా అర్థమైపోయింది. ఇందుకు ప్రపంచ దేశాలను మానసికంగా సిద్ధం చేయడం కోసమే తైవాన్ గగనతలంలో విన్యాసాలు చేస్తోంది. అయితే డ్రాగన్ ఊహించని విధంగా ఓ విషయం షాక్ కొట్టినట్లయింది. ఇంతకీ విషయం ఏమిటంటే తైవాన్ కు మద్దతుగా తైవాన్ లో అమెరికా సైన్యం మోహరించింది.

అంటే మొన్నటి వరకు ఆఫ్ఘనిస్థాన్లో ఉన్నట్లు కాకుండా తైవాన్ లో సైన్యానికి అమెరికా మిలిటరీ కమెండోలు, మెరైన్ నిపుణులు చాలా కాలంగా శిక్షణ ఇస్తున్నట్లు తాజాగా బయటపడింది. ఏదో రోజు తైవాన్ ను చైనా కబళిస్తుందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్ ముందుగానే ఊహించినట్లున్నారు. అందుకనే ఆ పరిస్థితి వస్తే తైవాన్ తనను తాను కాపాడుకునేట్లుగా మిలిటరీ, మెరైన్ కమెండోలు, నిపుణులను తైవాన్ కు పంపి శిక్షణిప్పిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ బయటపెట్టింది.

ఎప్పుడైతే విషయం బయటపడిందో అప్పటినుండి డ్రాగన్ లబోదిబోమంటోంది. అంతర్జాతీయ ఒప్పందాలను, చైనాతో అమెరికా చేసుకున్న ఒప్పందాలను గౌరవించాలని డ్రాగన్ పాలకులు అమెరికాకు గుర్తు చేస్తున్నారు. అంటే తైవాన్ విషయంలో తాము అనుకున్నది అనుకున్నట్లుగా జరగదన్న విషయం డ్రాగన్ కు బాగా అర్ధమై పోయినట్లుంది. అందుకనే అమెరికా విషయంలో చైనా పాలకులు గోల గోల మొదలుపెట్టారు. ఇదే సమయంలో అమెరికా కూడా కాస్త ముందు జాగ్రత్తగా వ్యూహాలు రచించినట్లు అర్ధమవుతోంది.

నిజంగానే డ్రాగన్ గనుక తైవాన్ ను ఆక్రమించాలని దండెత్తితే ఆ దాడులను అమెరికా అడ్డుకునే అవకాశం లేదు. ఎందుకంటే అమెరికా మేల్కొనే లోపే డ్రాగన్ సైన్యం తైవాన్ పై విరుచుకు పడిపోతాయి. డ్రాగన్ బలం ముందు తైవాన్ ఎందుకూ పనికిరాని. కాబట్టి కబ్జా అన్నది క్షణాల్లోనే ముగిసిపోతుంది. అందుకే చైనాను తైవాన్ కాస్త ప్రతిఘటించే ట్లుగా ముందస్తుగా మెరైన్ నిపుణులతో శిక్షణ ఇప్పిస్తోంది.

అలాగే అత్యంతాధునిక ఆయుధాలను కూడా గతంలోనే తైవాన్ కు అమెరికా అందచేసింది. ఆయుధాలు, మెరైన్ సైన్యంతో ఒక్కరోజు గనుక తైవాన్ తనను తాను కాపుకాచుగోగలిగితే మిత్రదేశాలను డ్రాగన్ కు వ్యతిరేకంగా రంగంలోకి దించాలన్నది అమెరికా వ్యూహమట. మరి తైవాన్ ఏమి చేస్తుందనేది ఆసక్తిగా మారింది.