Begin typing your search above and press return to search.

వైరల్ : కరోనా మృతదేహాలని తరలిస్తున్న అంబులెన్సులు ..

By:  Tupaki Desk   |   15 April 2021 2:30 PM GMT
వైరల్ : కరోనా మృతదేహాలని తరలిస్తున్న అంబులెన్సులు ..
X
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో ప్రతి రోజు కూడా దాదాపుగా 2 లక్షల వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో ఊహించని విదంగా కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడం తో పలు రాష్ట్రాల్లో ఆస్పత్రుల్లో కరోనా పేషేంట్స్ కి బెడ్స్ కూడా దొరకని పరిస్థితిలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర , ఢిల్లీ , గుజరాత్ తో సహా పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే .. కరోనా తో మరణించేవారు కూడా భారీగా పెరుగుతుండటం ఆందోళన ను పెంచుతుంది. ఇదిలా ఉంటే .. దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రము మహారాష్ట్ర.. అయితే , ప్రస్తుత పరిస్థితులని బట్టి చూస్తే ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ మరో మహారాష్ట్రలా మారుతుందా అనే అనుమానం రాకమానదు. గత కొన్ని రోజులుగా, రాష్ట్రంలో కోవిడ్ -19 కొత్త కేసులు మరియు మరణాలు భారీగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్యకు 5000 మార్కును తాకుంది. కరోనా తో మరణించిన వారి డెడ్ బాడీలని దహనం చేయడానికి కూడా కష్టమవుతుంది.

అహ్మదాబాద్‌ లో కరోనా తో మృతి చెందిన వారి మృతదేహాలని తీసుకువెళ్తున్న అంబులెన్సులు వీడియో ఒకటి ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ అవుతుంది. కరోనా మృతదేహాలతో అంబులెన్స్ లు శ్మశానవాటిక ముందు పడిగాపులు కాస్తున్నాయి. అలాగే అక్కడ ఒక్కొక్క శవాన్ని కాల్చడానికి సమయం ఎక్కువగా పడుతుండటం తో ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుంది. కరోనా వెలుగులోకి వచ్చిన కొత్తలో ఈ తరహా ఘటనలు బ్రెజిల్ , అమెరికా వంటి దేశాల్లో కనిపించాయి. కానీ, సెకండ్ వేవ్ కారణంగా మనదేశంలో కూడా కరోనా మృతదేహాలని కాల్చడానికి , శ్మశానవాటికకు తరలించడానికి వాహనాలు క్యూలో వెళ్తుండటం చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇది ఓ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాలేదు. కరోనా తో ఏ మాత్రం జాగ్రత్తగా లేకపోయినా కూడా పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అందరూ కూడా కరోనా నియమాలు పాటించండి.