Begin typing your search above and press return to search.

దారుణం : కరోనా పేషేంట్ పై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం

By:  Tupaki Desk   |   18 Sep 2020 4:30 PM GMT
దారుణం : కరోనా పేషేంట్ పై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం
X
కేరళలోని కొట్టాయం జిల్లాలో జరిగిందో ఘోరం. శనివారం రాత్రి అంబులెన్స్ డ్రైవరే, అందులో ఉన్న కరోనాపేషెంట్ ‌పై అత్యాచారం. అసలేం జరిగిందంటే... కొట్టాయం జిల్లాకు చెందిన ఓ యువతి తాజాగా కరోనా బారినపడింది. దీనితో కరోనా చికిత్స కోసం సెప్టెంబర్ 5న తన తల్లితో కలిసి కోజెన్‌చెరీ జిల్లా జనరల్ ఆస్పత్రికి వెళ్లింది. అయితే అక్కడ బెడ్స్ ఖాళీగా లేకపోవడంతో వారిని పందలంలోని కరోనా కేర్ సెంటర్ ‌కు తీసుకెళ్లాలని అంబులెన్స్ డ్రైవర్ నౌఫల్ కు చెప్పారు. దీనితో ఇద్దరిని అంబులెన్సు లో ఎక్కించుకుని డ్రైవర్ బయలుదేరాడు.

పేషెంట్‌ ను పందలం కరోనా సెంటర్ ‌లో, ఆమె తల్లిని కోజెన్ ‌చెరీ ఆస్పత్రి వద్ద దింపాలి. నిజానికి అతను వెళ్లే దారిలో పందలం పట్టణమే మొదట వస్తుంది. కానీ, కావాలనే అతను మొదట కోజెన్‌ చెరీకి వెళ్లి అక్కడ ఆమె తల్లిని దింపేశాడు. అనంతరం అంబులెన్సులో ఆ యువతి ఒక్కటే ఉండటంతో అంబులెన్స్ ను ఓ నిర్మానుష్య ప్రాంతం వైపు తీసుకెళ్లి ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను పందలం ఆస్పత్రిలో వదిలి అక్కడినుంచి వెళ్లిపోయాడు.

ఆ సంఘటన జరిగినప్పటి నుండి డిప్రెషన్ ‌లోకి వెళ్లిన బాధితురాలు, ఆ తరువాతే ఐసోలేషన్ వార్డులోని బాత్ రూమ్‌ లో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. అయితే వెంటనే సిబ్బంది అప్రమత్తమై తలుపులు బద్దలు కొట్టడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. అనంతరం ఆ యువతి డ్రైవర్ తనపై జరిపిన అఘాయిత్యం గురించి చెప్పడంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు,అంబులెన్స్ డ్రైవర్ నౌఫల్‌పై కేసు నమోదు చేశారు. అతనిపై గతంలోనూ ఓ హత్య కేసు నమోదైనట్లు గుర్తించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనపై స్పందించిన కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజ ఇది అమానవీయమైన చర్య అని అభిప్రాయపడ్డారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తెలిపారు.