Begin typing your search above and press return to search.
ఎజెండా మార్పుపై అంబటి నోట ఆసక్తికర వ్యాఖ్యలు
By: Tupaki Desk | 13 Feb 2022 3:05 PM ISTక్రెడిట్ వస్తే సీఎం జగన్ గొప్పతనం.. లెక్కల్లో తేడా వస్తే అది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 'శకుని' పాత్ర. ఇది.. ఏపీ అధికారపక్ష నేతల తీరుగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ సమావేశంలో ప్రత్యేక హోదా అంశం ఎజెండాగా చేరిందన్న సమాచారం బయటకు వచ్చినంతనే.. ఆ నిర్ణయాన్ని తీసుకున్న కేంద్రానికి థ్యాంక్స్ చెప్పే కన్నా.. దాని క్రెడిట్ తమదేనంటూ వైసీపీ నేతల ఆరాటం అంతా ఇంతా కాదు.
అది కాస్తా మారిపోయిన తర్వాత.. ఒక్కసారి కంగుతిన్న ఏపీ అధికారపక్ష నేతలు ఇప్పుడు.. ఈ ఎపిసోడ్ తో ఏ మాత్రం సంబంధం లేని చంద్రబాబు మీద పడటం చూస్తే.. కలిసి వస్తే తమది.. తేడా వస్తే చంద్రబాబుదన్న విధానాన్ని ఎంత పక్కాగా ఫాలో అవుతున్నారో ఇట్టే అర్థమైపోతుంది. ఎజెండాలో తొలుత పేర్కొన్న తొమ్మిది అంశాల స్థానే ఐదు అంశాలు చేరటంపై వైసీపీ ఎమ్మెల్యే కమ్ ఫైర్ బ్రాండ్ అంబటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఏపీకి అనుకూలంగా కేంద్ర కమిటీ ఒక అంశాన్ని చేరిస్తే జీవీఎల్ ఎందుకంత హడావుడి పడి సుమోటోగా దాన్ని తీసివేయాలని చెప్పారో.. ఆయనకు అంత ఆత్రమో ఆయనే వివరణ ఇవ్వాలన్న అంబటి.. ఎజెండాలో హోదా అంశం కనిపించినంతనే.. వెనుకా ముందు చూసుకోకుండా తమ అధినేతకు క్రెడిట్ అంతా కట్టబెట్టటానికి అంత ఆరాటం ఎందుకు పడ్డారో అంబటి అండ్ కో చెప్పగలుగుతారా?
హోదా అంశం ఎజెండాలో లిస్టు కావటం అనూహ్యం. అసలెందుకు ఇలా జరిగింది? అన్న అంశంపై కాస్త నిదానించి వ్యవహరించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో? అందుకు భిన్నంగా విపరీతంగా ఆత్రపడిపోయి.. క్రెడిట్ కోసం వైసీపీ నేతలు పడిన పాకులాట విషయాన్ని వెంటనే టేకప్ చేయాలనే పరిస్థితికి తీసుకొచ్చిందని చెప్పక తప్పదు. ఎజెండా బయటకు వచ్చినంతనే యుద్ధ ప్రాతిపదికన స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. సమావేశం జరిగేది గురువారం. అంటే దాదాపు ఐదారురోజులు సమయం ఉన్న వేళ.. జరగాల్సినవి ఎన్నో ఉన్నాయి.
అన్నింటి మీద వెనువెంటనే స్పందించే కన్నా.. కాస్త ఆచితూచి అన్నట్లు రియాక్టు అయితే కొంపలేమీ మునిగిపోవు. అలాంటివి ఆలోచనలు ఏమీ చేయని అంబటి మాత్రం.. టీడీపీ అధినేత చంద్రబాబు మీదా.. ఆయన టీం మీదా మండిపడ్డారు. అంతేకాదు.. టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన సుజనా చౌదరి అండ్ కో మీద బురద చల్లే ప్రయత్నం చేశారు.
ప్రత్యేక హోదా అంశాన్ని ఎజెండాగా పెట్టినంతనే చంద్రబాబు ముఖం మాడిపోవటం చూసి బీజేపీలోని బాబు వర్గానికి చెందిన సుజనా చౌదరి.. సీఎం రమేశ్ లు ఆయన ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగి ఎజెండాను మార్చినట్లుగా స్పష్టమవుతుందని పేర్కొన్న అంబటి మాటల్ని వింటే నవ్వాగదు.
ఎందుకంటే అంత సీన్ సుజనాకు.. సీఎం రమేశ్ కు ఉండి ఉంటే.. ఈపాటికి రెండు పార్టీల మధ్య సయోధ్య చేసే వారు కదా? నిజంగానే అంత సీన్ ఆ ఇద్దరు నేతలకు ఉండి ఉంటే.. జగన్ ప్రభుత్వం ఇంత కుదురుగా.. సాఫీగా ఉండేదా? మొన్నటికి మొన్న సీఎం జగన్ కోరినంతనే యుద్ధ ప్రాతిపదికన ప్రధానితో అపాయింట్ మెంట్ కోరినంతనే ఇచ్చేయటం.. ఆ సందర్భంగా జరిగిన భేటీలో చర్చించిన అంశాలు పెద్దగా బయటకు రాకపోవటం తెలిసిందే.
నిజంగానే చంద్రబాబు గేమ్ ప్లాన్ కు తగ్గట్లు సుజనా.. సీఎం రమేశ్ లు నడుచుకున్నట్లైయితే.. సమావేశ వివరాలు ఈపాటికి లీకై.. సీఎం జగన్ ఇరుకున పడే వారు కదా? అన్న ప్రశ్నను మర్చిపోకూడదు. ఏతావాతా.. ఎజెండాలోని అంశాల తొలగింపుపై కవరింగ్ విషయంలో అంబటి పడిన ఆత్రుత అర్థం కావటమే కాదు.. ఆయన వాదన నవ్వు తెప్పించేలా ఉండటం గమనార్హం.