Begin typing your search above and press return to search.

అమెరికాలో వైసీపీ ఆఫీసులు

By:  Tupaki Desk   |   13 July 2016 1:27 PM IST
అమెరికాలో వైసీపీ ఆఫీసులు
X
వైసీపీ అధినేత - ఏపీలో విపక్ష నేత జగన్ మోహనరెడ్డి తన పార్టీని విశ్వవిఖ్యాతం చేయాలనుకుంటున్నారట. అందులో భాగంగా అమెరికాలో కూడా పార్టీ ఆఫీసులు తెరవబోతున్నారు. జగన్ ఆదేశాలను అందుకున్న ఆ పార్టీ నేత అంబటి రాంబాబు ఇప్పటికే అమెరికాలోని కాలిఫోర్నియాలో వైసీపీ కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. అక్కడి మిగతా నగరాల్లోనూ కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం.

కాగా అమెరికాలో తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారితో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అక్కడ వైఎస్ జయంతి - వర్థంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని తెలుగు ప్రజలను ఏకం చేసేందుకు... వైసీపీ అభిమానులకు చేరువయ్యేందుకు వీలుగా పార్టీని అక్కడికి విస్తరించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఏపీలోని తెలుగు దేశం పార్టీ, తెలంగాణలోని టీఆరెస్ పార్టీలో నిత్యం అమెరికాలో ఏదో ఒక కార్యక్రమంచేపడుతూ హడావుడి చేస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలను విరాళాలు అంటూ పార్టీ కార్యక్రమాలును నిర్వహిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఆ రెండు పార్టీలూ విదేశాల్లో దూసుకుపోతుండడంతో తమ పార్టీని కూడా అక్కడ పాదుకొల్పాలని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇవన్నీ ఆలోచించే జగన్ ఈ విషయంలో తొందరగా నిర్ణయం తీసుకున్నారని.. త్వరలోనే అమెరికాలో తెలుగు ప్రజలు ఉండే ప్రధాన నగరాలన్నిట్లోనూ వైసీపీ ఆఫీసులు వెలుస్తాయని చెబుతున్నారు. నిజానికి .. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాదు నుంచి విజయవాడకు పార్టీ ఆఫీసు మార్చడానికే చాలా సమయం తీసుకున్న జగన్ ఈ విషయంలో మాత్రం అలాంటి ఆలస్యం చేయలేదు. అనుకున్నదే తడవుగా నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు.