Begin typing your search above and press return to search.
బాబు కేసును ఆయనకే చుట్టేసిన అంబటి
By: Tupaki Desk | 22 Sept 2016 11:41 AM ISTతెలంగాణలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి మారిన వ్యవహారంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు జంపింగ్‌లను ప్రోత్సహిస్తున్న నాయకులకు చెంపపెట్టులాంటిదని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందని అంబటి పేర్కాన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగుదేశం ఎమ్మెల్యేలను కొంటున్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. మరి ఏపీలో చంద్రబాబు చేస్తున్నదేంటని నిలదీశారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు ఇద్దరు చేస్తున్నది ఒక్కటేనని చెప్పారు. అక్కడో విధంగా, ఇక్కడో విధంగా మాట్లాడడం సమంజసం కాదని అంబటి అన్నారు.
కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు నైతికంగా స్పీకర్ కు, ఏపీకి కూడా వర్తిస్తాయని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని కొనుక్కున్న 20 మంది ఎమ్మెల్యేల చేత తక్షణమే రాజీనామా చేయించి ఎన్నికలకు పోవాలని బాబు సర్కార్ ను డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే స్పీకర్ వ్యవస్థ సరైంది కాదని సభాపతి కోడెల శివప్రసాదరావుకు అంబటి సూచించారు. చట్టప్రకారం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూన్నెళ్లలోపు అనర్హత వేటు వేయాలని...లేకపోతే న్యాయస్థానాలు జోక్యం చేసుకోక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా చర్య తీసుకోవాలని, తగిన నిర్ణయం తీసుకోకపోతే మేము కూడా హైకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.
తాను అధికారంలోకి వస్తే బీసీలకు నష్టం జరగకుండా ఆర్నెళ్లలోనే కాపులను బీసీల్లో చేరుస్తానని చెప్పిన చంద్రబాబు...ఇచ్చిన హామీని విస్మరించి కాపులు, బీసీల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని అంబటి ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఇచ్చిన హామీనే కాపులు అడుగుతున్నారని, కొత్తగా ఏమీ అడగడం లేదని చెప్పారు. ఇదే విషయాన్ని బీసీ సోదరులు అర్థం చేసుకోవాలన్నారు. కాపులకు, బీసీలకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని అంబటి స్పష్టం చేశారు. కుట్రపూరితంగా మంజునాథ కమిషన్ వెళ్లిన చోటల్లా.. బీసీలను కాపులమీదకు రెచ్చగొట్టి రాజకీయ లబ్దిపొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ ఆవేశపడొద్దని చెప్పాల్సిన బాబు.... ఇద్దరి మధ్య మంట పెట్టి చలికాగాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు. అలా చేయడం మంచి పద్దతి కాదని అంబటి రాంబాబు హెచ్చరించారు.