Begin typing your search above and press return to search.

అంబటి మాట‌!.. బాబుది ప్ర‌చార ఆర్భాట‌మే!

By:  Tupaki Desk   |   10 Oct 2017 6:13 PM IST
అంబటి మాట‌!.. బాబుది ప్ర‌చార ఆర్భాట‌మే!
X
ఏపీ సీఎం చంద్ర‌బాబుపై వైసీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు ఎక్కిదిగారు. బాబు పాల‌న డొల్ల పాల‌నేనంటూ విరుచుకుప‌డ్డారు. రైతుల‌కు పెద్ద ఎత్తున రుణ‌మాఫీ చేస్తామ‌ని చెప్పి - ఇప్పుడు రైతుల‌ను నిలువునా మోసం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిన్నిటి నుంచి రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రారంభ‌మైన రుణ మాఫీ కేవ‌లం రైతుల‌ను మోసగించే గిమ్మిక్కేన‌ని అన్నారు. రుణమాఫీ విషయంలో రైతులకు వేల కోట్లలో నష్టం కలిగించారని రాంబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతుల రుణమాఫీపై చంద్రబాబు వ్యాఖ్యలు పబ్లిసిటీ స్టంటేనని తేల్చేశారు.

మూడో విడదల నిధుల విడుదల గురించి చంద్రబాబు ఏదో ఘన కార్యం చేశారని చెబుతున్నారు. సక్రమంగా చేసి ఉంటే రుణాలు తగ్గాలి. కానీ, ఎందుకు పెరిగాయి? అని అంబటి ప్రశ్నించారు. 87 వేల కోట్లున్న రుణాలు.. ప్రస్తుతం లక్ష కోట్లకు చేరాయని ఆయన చెప్పారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం 2014-15 సంవత్సరానికిగానూ ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఇచ్చిన 2,365 కోట్లను ఇప్పటి వరకు రైతులకు ఎందుకు ఇవ్వలేదంటూ చంద్రబాబును నిలదీశారు. సున్నావడ్డీ, పావలా వడ్డీ రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎగ్గొట్టడం ద్వారా చంద్రబాబు 66, 365 కోట్లు నష్టం కలిగించారని అంబటి పేర్కొన్నారు.

అంబటి చేసిన ఈ హాట్ కామెంట్ల‌తో పొలిటిక‌ల్ సీన్ హీటెక్కింది. నిజానికి 2014లో అధికారం చేప‌ట్టేట‌ప్పుడు చంద్ర‌బాబు నిజాయితీగా త‌న ఎన్నిక‌ల హామీల‌కు క‌ట్టుబ‌డి సీఎంగా తొలి సంత‌కం రుణ‌మాఫీపై చేశార‌ని ఆర్థిక మంత్రి, సీఎం రైట్ హ్యాండ్ య‌న‌మ‌ల డ‌బ్బా కొట్టారు. అయితే, అదేస‌మ‌యంలో ఆయ‌న మ‌రోమాట కూడా అన్నారు. ఈ రుణాలు ఇవ్వ‌డం కోసం.. మ‌రోచోట రుణాలు చేస్తున్నామ‌ని చెప్పారు. అంటే .. దీనిని బ‌ట్టి.. ఏపీ ప్ర‌భుత్వానికి ఓ దిక్సూచి అంటూ ఏమీలేదు. కేవ‌లం ప్ర‌క‌ట‌న‌లు గుప్పించుకోవ‌డం, డ‌బ్బా పేప‌ర్ల‌లో క‌థ‌నాలు రాయించుకోవ‌డం త‌ప్ప ఈ ప్ర‌భుత్వానికి మేనేజ్ మెంట్ అంటే ఏమిటో తెలియ‌ద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి అంబ‌టి వ్యాఖ్య‌ల‌తో రైతు రుణ‌మాఫీపై బాబు స‌ర్కారు ఆడుతున్న నాట‌కం బ‌ట్ట‌బ‌య‌లైంది.