Begin typing your search above and press return to search.
బాబు కాళ్లు పట్టుకొని..లోకేష్ భజన చేస్తే పదవి!
By: Tupaki Desk | 21 Jun 2017 11:23 PM ISTబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును తొలగించిన తీరు పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విస్మయం వ్యక్తం చేశారు. ఐవైఆర్‌ను తొలగించిన విధానం కేవలం ఆ సామాజిక వర్గమే కాకుండా ప్రజాస్వామ్యంలోని సభ్యసమాజమంతా బాధపడాల్సిన రోజు అని అన్నారు. ``ఐవైఆర్ కృష్ణారావు రాజకీయ నేత కాదు.. 30 ఏళ్లకు పైగా ఐఏఎస్ అధికారిగా పనిచేసిన వ్యక్తి. బ్రాహ్మణోత్తముడైన ఐవైఆర్‌ను అవమానపర్చిన సీఎం చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు`` అని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాళ్లు పట్టుకుంటేనో.. లేక లోకేష్‌ను బతిమిలాడితేనో వచ్చిన పదవి కాదని అందుకే నిజాయితీగా తన భావాలను వ్యక్తపరిచారని అంబటి అన్నారు.
చంద్రబాబు భజన చేసే వారికి కార్పొరేషన్ చైర్మన్‌లుగా నియమిస్తున్నారన్నారని అంబటి ఆరోపించారు. కాపు కార్పొరేషన్‌లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారని ఆ సామాజిక వర్గ పెద్ద ముద్రగడ పద్మనాభం అన్నారని అంబటి గుర్తు చేశారు. ఐవైఆర్ కృష్ణారావు అనే నిజాయితీ గల అధికారి టీడీపీ పార్టీకి అనుకూలంగా ప్రవర్తించలేదనే కక్షకట్టి తొలగించారనేది స్పష్టంగా అర్థం అవుతోందని అంబటి అన్నారు. జన్మభూమి కమిటీలు నిర్ణయించిన వారిని మాత్రమే లబ్ధిదారులుగా చేర్చుకోవాలనే ఆచారాన్ని కృష్ణారావు వ్యతిరేకించారన్నారు. . జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమ నిధులను వక్రమార్గం పట్టించి కేవలం తెలుగుదేశం పార్టీ నేతలకు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారనేది ఐవైఆర్ సంఘటన ఒక ఉదాహరణ అని అంబటి అన్నారు. చంద్రబాబును ఎవరు వ్యతిరేకించినా సొంత పార్టీ నేతలనైతే తొక్కేస్తున్నారు.. అధికారులు, ఇతర పార్టీ నేతలనైతే తొలగించడం, కేసులు పెట్టించడం వంటి కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని అంబటి మండిపడ్డారు. టీడీపీ దళిత ఎంపీ శివప్రసాద్‌ను కూడా చంద్రబాబు అవమానపరిచారని, టీడీపీ ఎంపీకే ఆరు నెలలుగా సీఎం అపాయింట్‌మెంటే దొరకలేదన్నారు.
ఎవరికీ టైం ఇవ్వకుండా చంద్రబాబు గడిపేస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఒకవేళ ఎవరికైనా టైమ్ ఇస్తే గంటల తరబడి సోది చెప్పి చంపేస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. బహుశా చంద్రబాబు మానసిక పరిస్థితి సరిగ్గా లేనట్లుగా అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ``బాలకృష్ణ సినిమాకు ఎందుకు రాయితీలు ఇచ్చారు. మీ బావమరిది గొప్పగా నటిస్తే ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎందుకు ఇవ్వడం... మీరు వివక్షతో పనిచేస్తున్నాని ఐవైఆర్ పోస్టులు షేర్ చేస్తే తప్పా?`` అని అంబటి ప్రశ్నించారు. ఐవైఆర్‌ను అవమానపర్చిన చంద్రబాబు ప్రతిఫలం అనుభవించక తప్పదన్నారు. బ్రహ్మణ, కాపు ఏ కార్పొరేషన్ అయినా.. టీడీపీ కార్యకర్తలకు పనికొచ్చేది కాదు.. కాకూడదని, ఆయా కులాల్లోని పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని అంబటి సూచించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/