Begin typing your search above and press return to search.
ఈసారి సీఎం జగనే.. లాజిక్ ఇదీ..
By: Tupaki Desk | 4 Jun 2018 10:01 PM IST2019 ఎన్నికల్లో గెలిచేదెవరు? ఏపీ సీఎం ఎవరు? పొటీ వైసీపీ - టీడీపీల మధ్యేనా.. జనసేన రాకతో ముక్కోణపు పోటీ తప్పదా?.. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో అంత వ్యతిరేకత ఉండగా టీడీపీ ఇంకెలా గెలుస్తుంది..?.. ఇదీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్న రాజకీయ చర్చ. అయితే.. ఈ చర్చలన్నిటి మాట పక్కనపెడితే వైసీపీ నేత అంబటి రాంబాబు చెప్పిన లాజిక్ ప్రకారం ఈసారి జగన్మోహనరెడ్డే సీఎం కానున్నారు. ప్రజలతో మమేకమవుతూ.. వారి కష్టాలు తెలుసుకుంటూ జగన్ చేస్తున్న పాదయాత్రే ఆయన్ను సీఎం చేస్తుందని జనం నుంచీ వినిపిస్తోంది.
పాదయాత్ర చేసే ప్రతిపక్ష నేత సీఎం అయ్యే సెంటిమెంటు ఏపీలో ఉందని.. వైఎస్ రాజశేఖరెడ్డి - చంద్రబాబునాయుడు అలా పాదయాత్రల తరువాత సీఎం అయ్యారని.. ఇప్పుడు జగన్ కూడా సీఎం కానున్నారని అంబటి అన్నారు. అయితే... మన సభలకు జనం వస్తున్నారని 2019లో అధికారం మనదే అనే మితిమీరిన విశ్వాసానికి పోవద్దని - జగన్ కష్టాన్ని అందరికీ వివరిస్తేనే ఎన్నికల్లో విజయం సాధిస్తామని రాంబాబు కార్యకర్తలతో అన్నారు. చంద్రబాబును తక్కువగా అంచనా వేయొద్దని బలమైన వ్యూహాలతో రాజకీయాలను తనవైపు తిప్పుకోగలరని అన్నారు.
నరేంద్ర మోడీ - యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ - చంద్రబాబు నాయుడు.. ముగ్గురు రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. హోదా మాట ఎత్తితే కేసులు పెడతానని హెచ్చరించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మాటమార్చి మోడీ మోసం చేశాడని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని అంబటి విమర్శించారు.