Begin typing your search above and press return to search.

న‌దుల ప‌రిర‌క్ష‌ణ‌పై బాబుకు అంబ‌టి భ‌లే క్లాస్‌!

By:  Tupaki Desk   |   15 Sept 2017 6:54 PM IST
న‌దుల ప‌రిర‌క్ష‌ణ‌పై బాబుకు అంబ‌టి భ‌లే క్లాస్‌!
X
రాష్ట్రంలో న‌దుల ప‌రిర‌క్ష‌ణ‌కు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని, త‌మ హ‌యాంలోనే న‌దుల అనుసంధానం కూడా జ‌రుగుతోంద‌ని పెద్ద ఎత్తున త‌నకు తానే మార్కులు వేసేసుకున్న ఏపీ సీఎం చంద్ర‌బాబుపై వైసీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు ఓ రేంజ్‌ లో ఎక్క‌దిగారు! నదుల పరిరక్షణ గురించి చంద్రబాబు మాట్లాడటం దౌర్భగ్యమని మండిప‌డ్డారు. ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువు జ‌గ్గీవాసుదేవ్ నిన్న సీఎం చంద్ర‌బాబును క‌లిశారు. ఆయ‌న చేప‌ట్టిన న‌దుల ప‌రిర‌క్ష‌ణ యాత్ర‌ను బాబుకు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన చంద్ర‌బాబు.. న‌దుల‌కు త‌న‌తో ఎన‌లేని సంబంధం ఉంద‌న్నారు. న‌దుల‌ను ప‌రిర‌క్షించ‌డంలో త‌న‌తో ఎవ‌రూ పోటీ ప‌డ‌లేనివిధంగా దూసుకుపోతున్నాన‌ని గొప్ప‌లు పోయారు.

ఇప్పుడు ఈ కామెంట్ల‌పైనే సోష‌ల్ మీడియాలో బాబుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అదేస‌మ‌యంలో ప్ర‌ధాన విప‌క్షం వైసీపీ కూడా బాబును ఏకేసింది. పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. బాబును తీవ్ర‌స్థాయిలో దుయ్య‌బ‌ట్టారు. న‌ద‌లను దోచుకుంటున్న పార్టీ ఏదైనా ఉంటే ఈ దేశంలో ఒక్క టీడీపీనేన‌ని విమ‌ర్శించారు. ఇసుక, మట్టి దోపిడీలకు ఆ పార్టీ నేత‌లు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏపీలోని అన్ని నదుల్లోంచి ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను మీడియా ప్రతినిధులకు చూపించారు.

మ‌రో అడుగు ముందుకేసిన అంబ‌టి.. ఉండవల్లిలో సాక్షాత్తూ.. సీఎం చంద్రబాబు ఇంటి పక్కనే ఇసుక దోపిడీ జరుగుతోందని వెల్లడించ‌డంతో మీడియా సైతం అవాక్క‌యింది. సాక్షాత్తు నదీ నర్భంలోనే నిర్మించిన ఇంట్లోనే చంద్రబాబు ఉంటున్నారని తెలిపారు. నదుల నుంచి లక్షల కోట్లు దోచుకునే పనిలో పడ్డారని అన్నారు. ర్యాలీ ఫర్‌ రివర్స్‌ పేరుతో చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. 30 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీలో ఉన్నారని వెల్లడించారు. యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని దుయ్యబట్టారు. మ‌రి అంబ‌టి కామెంట్ల‌పై బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.