Begin typing your search above and press return to search.

ద్రోహుల్లో బాబు నెంబ‌రెంతో చెప్పిన అంబ‌టి

By:  Tupaki Desk   |   20 March 2018 6:26 PM IST
ద్రోహుల్లో బాబు నెంబ‌రెంతో చెప్పిన అంబ‌టి
X
ఏపీ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. వేస‌వి ఎండ‌ను బీట్ చేసేలా ఏపీ రాజ‌కీయ ప‌రిణామాలు అంత‌కంత‌కూ వేగంగా మ‌లుపులు తిరుగుతున్నాయి. ఓప‌క్క విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్న పాద‌యాత్ర‌తో అధికార‌ప‌క్షం ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ సీన్లోకి రావ‌టంతో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

నాలుగేళ్ల మద్ద‌తును బ‌ద్ధ‌లు కొడుతూ బాబు స‌ర్కారు తీరుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ దెబ్బ‌కు ఏపీ అధికార‌ప‌క్షం ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారింది. దీనికి తోడున్న‌ట్లు వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న వాడి వేడీ విమ‌ర్శ‌లు బాబు బ్యాచ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎంపై నిప్పులు చెరిగిన ఆయ‌న‌.. ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. దేశ రాజ‌కీయాల్లో బాబు నెంబ‌ర్ వ‌న్ ద్రోహిగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో బాబు పిల్లి మొగ్గ‌లు వేస్తున్నార‌న్న ఆయ‌న‌.. ఆరు వంద‌ల వాగ్దానాలు ఇచ్చిన బాబు ఒక్క‌టంటే ఒక్క హామీనైనా నిలబెట్టుకున్నారా? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు.

ఎన్నిక‌ల్లో ద్రోహుల్ని ఓడించాల‌ని బాబు అన‌టం విడ్డూరంగా ఉంద‌న్న అంబ‌టి.. దొంగే దొంగా.. దొంగా అని అరిచిన‌ట్లుగా బాబు తీరు ఉంద‌న్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో బాబుకు డిపాజిట్లు కూడా రావ‌న్నారు.చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్ మేక‌ప్ వేసుకొని వేషాలు వేస్తుంటే.. బాబు మాత్రం మేక‌ప్ వేసుకోకుండా వేషాలు వేస్తున్నారంటూ తీవ్రంగా విరుచుకుప‌డ్డారు.

హోదా మీద అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ జ‌రిగేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నిస్తుంటే.. చ‌ర్చ జ‌ర‌గ‌కుండా ఉండేలా బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తుంద‌న్నారు. లోక్ స‌భ‌లో మోడీ స‌ర్కారుపై అవిశ్వాసం తీర్మానంపై చ‌ర్చ జ‌రిగితే ఏపీకి జ‌రిగిన అన్యాయం దేశ ప్ర‌జ‌ల‌కు తెలుస్తుంద‌న్నారు. బీజేపీతో త‌మ పార్టీ కుమ్మ‌క్కు అయ్యింద‌ని బాబు ఆరోపిస్తున్నార‌ని.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌.. త‌మ వ‌ద్ద‌కే మొద‌ట‌ బీజేపీ వ‌చ్చింద‌ని.. తాము నో చెప్ప‌టంతోనే టీడీపీతో జ‌త క‌ట్టింద‌ని అంబ‌టి చెప్పారు.