Begin typing your search above and press return to search.
లోకేష్ ను సీఎం చేసేందుకే క్షుద్రపూజలు
By: Tupaki Desk | 2 Jan 2018 7:01 PM ISTదుర్గమ్మ గుడిలో అర్థరాత్రి తాంత్రిక పూజలు చేశారనే వార్తలు మీడియాలో గుప్పుమనడం అందరినీ కలకలం రేకెత్తించిన సంగతి తెలిసిందే. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఈ ఎపిసోడ్ పై సంచలన కామెంట్లు చేశారు. చంద్రబాబు తనయుడు లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు దుర్గమ్మ గుడిలో అర్థరాత్రి తాంత్రిక పూజలు చేశారని అంబటి ఆరోపించారు. పండితుల సలహా మేరకు తమిళనాడు నుంచి పూజారిని రప్పించి తాంత్రిక పూజలు చేశారని దుయ్యబట్టారు.
అభివృద్ధి చేయకుండా తాంత్రిక పూజలు చేసినందుకు ఓట్లు వేయాలా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని బాగు చేశానని అనుకుంటే ఓట్లు కొనకుండా ఎన్నికలకు వెళ్లగల దమ్ముందా అని నిలదీశారు. ఇసుక - మట్టి నుంచి అన్నింట్లో దందాలు చేసి వేల కోట్లు కొల్లగొట్టి వాటి ద్వారా అధికారంలోకి రావాలనే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఓటు వేయడానికి ప్రజలంతా సిగ్గుతో ఉన్నారు. కాకపోతే డబ్బులు విచ్చల విడిగా పంచి దౌర్జన్యం చేయాలనే కుట్రలు పన్నుతున్నారని అంబటి ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టి మరోసారి గెలవాలనే కుట్రతో చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా నెరవేర్చకుండా.. ఓటుకు నోటు అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చి ఏదో విధంగా అధికారంలోకి రావాలనే తాపత్రయం తప్ప మరొకటి లేదన్నారు. సీఎం అయిన తరువాత ఇప్పటి వరకు ఎన్ని దేశాలు తిరిగారు. ఎన్ని డబ్బులు ఖర్చు చేశారు. ఎన్ని పెట్టుబడులు తీసుకువచ్చారో.. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసినా సమాధానం లేదన్నారు. వందల కోట్లు సమ్మిట్‌ల కోసం ఖర్చు చేసినా కనీస పరిశ్రమలను కూడా తీసుకురాలేకపోయారన్నారు.
వచ్చే సాధారణ ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాలు గెలుస్తుందని, ఏదో ఒకటి రెండు చోట్ల ఓడిపోతే ప్రజలు సిగ్గుపడాలని చంద్రబాబు మాట్లాడడం విచిత్రంగా ఉందని అంబటి ఎద్దేవా చేశారు. చంద్రబాబు కష్టానికి ప్రతిఫలంగా కూలీ కింద ప్రజలు ఓట్లు వేయాలని, ఓట్లు వేయకపోతే ప్రజలే సిగ్గుపడాలని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు. 68 సంవత్సరాల వయస్సులో ఇంటికి పెద్ద కొడుకులా పనిచేస్తున్నాను అంటున్నారు. చంద్రబాబుకు మతిస్తిమితం ఉందో లేదో అర్థం కావడం లేదని అంబటి అన్నారు. ఈ మూడున్నరేళ్లలో ప్రజలకు ఏం చేశారని ఓట్లు వేయాలని చంద్రబాబును ప్రశ్నించారు. ఒక సెక్రటేరియట్ - అసెంబ్లీ కడితే బయట 2 అంగుళాల వర్షం పడితే వాటిల్లో 5 అంగళులా నీరు నిలుస్తుందని అంబటి స్పష్టం చేశారు.
600ల వాగ్ధానాలు ఇచ్చి పట్టుమని పది కూడా నెరవేర్చని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని, మీడియాను అడ్డం పెట్టుకొని గప్పాలు కొట్టుకుంటున్నారని అంబటి రాంబాబు అన్నారు. అసలు చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయాలని అంబటి ప్రశ్నించారు. `రుణాలు మాఫీ ప్రక్రియను పూర్తి చేశారా..? పోలవరానికి సమాధి కట్టినందుకు ఓటు వేయాలా..? ఓట్లకు రేటు పెట్టి కొనే పరిస్థితి తీసుకువచ్చారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి కొన్నందుకు, నలుగురిని మంత్రులను చేసినందుకు ఓట్లు వేయాలా..? దేనికి మీకు ఓట్లు వేయాలో చంద్రబాబు సమాధానం చెప్పండి` అని నిలదీశారు. చంద్రబాబుకు ఓట్లు వేయడానికి కాదు.. బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు.