Begin typing your search above and press return to search.
గ్రీన్ ఎనర్జీ బిజినెస్‌లోకి అంబానీ.. కుబేరుడి ఆస్తి పెరగడం ఖాయం!
By: Tupaki Desk | 27 Aug 2021 9:00 AM ISTప్రపంచ కుబేరుల జాబితాలో 4వ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ సంపద మరింత పెరుగుతుందా? ఆయన ఇప్పటికన్నా.. మరో నాలుగు మెట్లు ఎక్కనున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఆయన ఇప్పటికే ఉన్న వ్యాపారాలకన్నా మరింత ఆదాయం వచ్చే.. భవిష్యత్తులో దేశాన్ని శాసిస్తుందని భావిస్తున్న గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యారు. అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కావడం గమనార్హం.
ప్రస్తుతం బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం..గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్‌లో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రానున్న రోజుల్లో అంబానీ సుమారు రూ.60వేల కోట్లు డాలర్ల పెట్టుబడి పెట్టునున్నారు. ఈ పెట్టుబడులతో రూ.6.04 లక్షల కోట్లుగా ఉన్న ముఖేష్ అంబానీ సంపద మరింత పెరగనుంది. వాస్తవానికి ఇప్పటికే అంబానీకి గుజరాత్ జామ్ నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద‍్రం ఉంది. ఈ కేంద్రం ద్వారా అరేబియా సముద్రంలో ముడి చమురును వెలికి తీసి ఫ్యూయల్, ప్లాస్టిక్, కెమికల్స్‌ను తయారు చేస్తారు. పైప్‌లైన్‌ల నెట్‌వర్క్ ఇక్కడ రోజుకు14 లక్షల బారెల్స్ పెట్రోలియంను ప్రాసెస్ చేస్తున్నారు.
2021 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ తన సొంత కార్యకలాపాల కోసం 45 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ను ఉత్పత్తి చేసినట్లు బ్లూమ్ బెర్గ్ లెక్కలు చెబుతున్నాయి. ముఖేష్ ఆస్థి మొత్తంలో 60 శాతం ముడి చమురు ఉత్పత‍్తుల ద్వారా వచ్చిన సంపదే. ప్రపంచం మొత్తం పెట్రో కెమికల్స్ వ్యాపారాన్ని విస్తరించేందుకు ముఖేష్ అంబానీ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో పాటు గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టినా 2026 ఆర్థిక సంవత్సరం నాటికి వడ్డీ, పన్నులు, తరుగుదల, తీసుకున్న రుణాల్ని తీర్చినా రిలయన్స్ ఆదాయంలో 10% మాత్రమే ఖర్చవుతుందని, ఆయిల్-టు-కెమికల్స్ ప్రాసెస్ తో వచ్చే ఆదాయం 33 శాతం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది జూన్‌లో జరిగిన రిలయన్స్ వార్షిక సమావేశంలో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ మొబైల్ నెట్‌వర్క్‌లో జియో ఎలాంటి సంచలనాలు సృష్టించిందో, ఏ స్థాయిలో మార్పులు తీసుకువచ్చిందో.. రాబోయే రోజుల్లో అదే తరహా పరిస్థితులు గ్రీన్ ఎనర్జీ రంగంలో తెచ్చేందుకు కృషి చేస్తుందన్నారు. అంతేకాదు మూడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధికి ఊతం ఇచ్చిన శిలాజ ఇంధనాల యుగం ఎక్కువ కాలం కొనసాగదంటూనే.. గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాబట్టే ఈ గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు